హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాళ్లు మొక్కుతున్నా, బహిరంగంగా మాట్లాడొద్దు: గండ్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Gandra Venkataramana Reddy
హైదరాబాద్: నాడు 2010లో జరిగిన ఉప ఎన్నికల కన్నా ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తగ్గిందని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. "ఉప ఎన్నికల ఫలితాలపై మా పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో మా పార్టీకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయని మా నేతలు అంటున్నారు. దీనిపై బహిరంగంగా మాట్లాడవద్దని వారికి పాదాభివందనం చేస్తూ కోరుతున్నా" అని ఆయన అన్నారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

2010లో జరిగిన ఉప ఎన్నికలకు, ఈ ఉప ఎన్నికలకు తేడా స్పష్టంగా కనిపిస్తోందని, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీకి చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయని, కానీ, ఇప్పుడు సెంటిమెంట్ ఉన్నా మెజారిటీ స్థానాల్లో గణనీయమైన ఓట్లు సాధించామని ఆయన చెప్పారు. కావాలంటే అధిష్టానంతో నేరుగా మాట్లాడవచ్చునని ఆయన సూచించారు.18 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్న సమయంలో కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడొద్దని తమ పార్టీ నేతలను కోరారు. అభ్యర్థుల ఎంపికను సీఎం పూర్తి ఏకపక్షంగా చేశారనడం సరికాదన్నారు. అందరితో చర్చించాకే అభ్యర్థులను సీఎం నిర్ణయించారని గండ్ర చెప్పారు.

పద్ధతి ప్రకారం నైతిక బాధ్యత వహించాల్సి వస్తే వరంగల్ జిల్లాలో పార్టీ అభ్యర్థి ఓటమికి, జిల్లా అధ్యక్షుడిగా తాను, మంత్రులు బాధ్యత వహించాలన్నారు. కానీ, సీఎం, పీసీసీ చీఫ్ బాధ్యత వహించాలనడం సరికాదన్నారు. ఒకవేళ 2014లో పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే అప్పుడు బాధ్యత వారిద్దరిపై ఉంటుందని చెప్పారు. కడప ఉప ఎన్నికల్లో ఓడినప్పుడు.. మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి రాజీనామా చేశారా?'' అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం అందరి రాజీనామాలు కోరడం సబబు కాదన్నారు.

English summary
Government whip Gandra Venkataramana Reddy suggested senior Congress leaders not to speak against party interests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X