హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రవీంద్రనాథ్ రెడ్డి మిక్సింగ్ ప్లాంట్ ఉత్పత్తిపై నిషేధం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ravindranath Reddy
హైదరాబాద్: కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన బాలాజీ మిక్సింగ్ ప్లాంట్‌లో ఎరువుల ఉత్పత్తిని ప్రభుత్వం నిషేధించింది. ఈ ప్లాంటులో ఇక నుంచి 17: 17: 17 కాంప్లెక్స్ ఎరువు తయారీని నిషేధిస్తూ వ్యవసాయ కమిషనర్ ఉషారాణి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాంప్లెక్స్ ఎరువుల్లో బాగా డిమాండ్ ఉన్న ఎరువు ఇదే కావడం విశేషం. దీన్ని నిషేధించడం వల్ల మిక్సింగ్ ప్లాంట్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ ప్లాంట్‌లో గత కొంత కాలంగా నాసిరకం ఎరువులు తయారు చేస్తున్నట్లు బయటపడడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్లాంట్ లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ వ్యవసాయ శాఖ రవీంద్రనాథ్ రెడ్డికి గత నవంబర్ 28వ తేదీన నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు ప్లాంటు నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. దీంతో ఎరువు తయారీని నిషేధించింది. ప్రస్తుత నిల్వలను ఏప్రిల్ 5వ తేదీలోగా బయటకు పంపేయాలని ఆదేశించింది.

English summary
Government has banned production of fertilisers by Ravindranath Reddy's mixing plant
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X