హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వెళ్తుంటే అంత హంగామానా?: రాజేంద్ర ప్రసాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

MLC Rajendra Prasad
హైదరాబాద్/ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా 1100 బస్సులను దగ్ధం చేసేందుకు ఆ పార్టీ కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ ఆదివారం విమర్శించారు. ఇందు కోసం జగన్ రూ.110 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. జగన్‌ను రక్షించేందుకు అంత సెక్యూరిటీ ఎందుకని ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రజలను రక్షించడానికి ఉందా, జగన్‌ను రక్షించేందుకు ఉందా అన్నారు. జగన్ విచారణకు వెళుతున్న సమయంలో అంత హడావుడి, హంగామా అవసరమా అన్నారు. తనను అరెస్టు చేస్తే విధ్వంసం సృష్టిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను బలి చేశారని కాంగ్రెసు నేతలు అంటున్నారని, మరి మోపిదేవి బలి కావడానికి కారకులు ఎవరో చెప్పాలని నిలదీశారు.

తెలుగుదేశం పార్టీ నుండి జగన్ పార్టీలోకి వెళ్లే వారు ఎవరూ లేరన్నారు. రాష్ట్రంలోని నేరగాళ్లంతా జగన్‌తోనే ఉన్నారని ఆరోపించారు. దిల్ కుషా అతిథి గృహం ఏమైనా గాంధీ భవనా అని ప్రశ్నించారు. ఉండవల్లి అరుణ్ కుమార్, వట్టి వసంత్ కుమార్, ఆళ్ల నాని, సబ్బం హరిలను లోనికి ఎందుకు అనుమతిస్తున్నారన్నారు. కిరణ్, జగన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్నారు. అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ తాము 31న హర్తాళ్లు నిర్వహిస్తామన్నారు.

వైయస్ జగన్.. కేసులు, సిబిఐ విచారణ వల్ల వచ్చే సానుభూతితో ఉప ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నారని ప్రకాశం జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మైసూరా రెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పటి నుండి టిడిపి పొందిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. మన్మోహన్ సింగ్ చేతకానితనం వల్లనే పెట్రోలు ధరలు పెరిగాయన్నారు. యుపిఏ భాగస్వామ్య పక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు.

English summary
Telugudesam Party senior leader and MLC Rajendra Prasad questioned.. Kiran Kumar Reddy government is creating hungama at the time YSR Congress Party cheif and Kadapa MP YS Jaganmohan Reddy is going to CBI enquiry from his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X