శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై కొంగ కథ చెప్పిన కిరణ్: హైటెక్ సిటీ చూపించి..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Kiran Kumar Reddy
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం వాడుకలో ఉన్న ఓ పొట్టి కథ చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో ఇందిర బాట ప్రారంబించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు బిసి జపం చేస్తున్నారని, కానీ అది కొంగ జపమని ఎద్దేవా చేశారు.

చెరువులో ఉన్న చేపలను వేటాడేందుకు చేప ఒంటికాలిపై జపం చేస్తున్నట్లుగా నటిస్తుందని, చేప దగ్గరకు రాగానే ఆ కొంగ వెంటనే దానిని ఆరగిస్తుందని అన్నారు. చంద్రబాబు కూడా ప్రస్తుతం బిసి జపం చేస్తున్నారని, అదంతా కొంగ, దొంగ జపమన్నారు. బాబును ఎవరూ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు. అతను రెండు కాళ్లు నెత్తిన పెట్టుకొని జపం చేసినా ఎవరూ నమ్మరన్నారు. బాబు ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు.

తమది రైతు ప్రభుత్వమని, అలా ధైర్యంగా చెప్పుకోగలమన్నారు. టిడిపి హయాంలో మాత్రం చంద్రబాబు నిత్యం హైదరాబాద్, హైటెక్ సిటీ చుట్టూ తిరుగుతూ ఇప్పటికీ అభివృద్ధి అంటే దానినే చూపిస్తారని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి నిదర్శనంగా హైటెక్ సిటీని చూపించినప్పటికీ అదే హైదరాబాదులో బాబు ఒక్క సీటును కూడా గెల్చుకోలేక పోయారని విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రతి నీటి చుక్కను రైతుకు చేరే విధంగా ప్రయత్నిస్తుందన్నారు.

డిపాజిట్ లేకుండా రైతులకు బ్యాంక్ అకౌంట్లు ఇవ్వాలని తాను బ్యాంక్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సొసైటీగా కొనుగోలు చేస్తే యంత్రాలను సగం ధరకే ఇచ్చే విధంగా చేస్తామన్నారు. రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీలు నేరుగా ఆన్ లైన్ లో ఇస్తామన్నారు. రూ.2500 కోట్లతో రైతులకు వ్యవసాయ పరికరాలు ఇస్తున్నట్లు చెప్పారు. తోటపల్లి ఎడమ కాల్వను ఓనిగడ్డ చానెల్‌కు అనుసంధానం చేస్తామన్నారు. దీని కోసం తక్షణమే ఆరు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సాగునీటి ప్రయోజనాలు కాపడతామన్నారు.

English summary
CM Kiran Kumar Reddy told a story of stork on Friday in his indiramma bata for Telugudesam party chief Nara Chandrababu Naidu's BC strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X