హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్ణయం ఆశ్చర్యం కల్గించింది: కేంద్రంపై బొత్స అసంతృప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యుత్ కోత, గ్యాస్ కొరత పైన ఆయన ఉదయం గాంధీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్యాస్ కేటాయింపులపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన అన్నారు.

రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానాలలో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. గ్యాస్ పైన మీడియాలో వస్తున్న వార్తలన్నీ వాస్తవావాలే అన్నారు. వర్షాలు లేకనే విద్యుదుత్పత్తికి ఆటంకం కలుగుతోందన్నారు. నిరాటంకంగా కరెంట్ ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదని కానీ పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా లేవన్నారు.

తీవ్ర వర్షాభావం వల్లే అంచనాలకు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి కావడం లేదన్నారు. అందుకే విద్యుత్ సంక్షోభం తలెత్తుతోందన్నారు. దీనికి తోడు గ్యాస్ కోటాలో రాష్ట్రానికి మరింత ఇబ్బందికరమే అన్నారు. దబోల్ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ప్రభుత్వ ప్రాజెక్టు అన్నారు. 2008కి ముందే కళ్లు తెరిచి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అన్నారు.

కాగా రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ కోటాను మహారాష్ట్రకు తరలించడంపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. దీనిపై సొంత పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. కిరణ్ తమ గ్యాస్ తమకే కేటాయించమని అడిగేందుకు ఢిల్లీ వెళ్లారు.

English summary
PCC chief and Transport minister Botsa Satyanarayana disappointed on central government policies on gas allotment to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X