హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై షిండే: నాగం ఫైర్, డోంట్ కేర్.. కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram-Nagam Janardhan Reddy
హైదరాబాద్: కేంద్రమంత్రి షిండే వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు హరీష్ రావు, నాగం జనార్ధన్ రెడ్డి, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం తీవ్రంగా స్పందించారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే ఇక్కడి ప్రజలు ఆ పార్టీని పాతాళానికి తొక్కుతారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ పార్టీ, తమ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ అడ్డుకుంటే ఎవరినైనా తరిమి కొడతామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నక్సలిజానికి ముడిపెట్ట వద్దని నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సీమాంధ్ర నేతల ప్రభావంతో తెలంగాణకు వ్యతిరేకంగా నక్సలిజం అంటూ మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజా ఉద్యమానికి నక్సలిజంతో ముడి పెట్టవద్దని ఆయన కోరారు. తెలంగాణ తప్ప తాము మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే ప్రసక్తి లేదన్నారు.

కేంద్ర హోంమంత్రి షిండే తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు విధాన ప్రకటన కాదని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోదండరామ్ వేరుగా అన్నారు. బలమైన శక్తులు తెలంగాణను అడ్డుకుంటున్నాయని, పెద్ద స్థాయిలో ఒత్తిడి తేవాలని, అదే పనిలో తాము ఉన్నామని చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

రెండు మూడు రోజుల్లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి తెలంగాణ మార్చ్ పైన సమాచారం ఇస్తామని కోదండరామ్ తెలియజేశారు. తెలంగాణ మార్చ్ కార్యాచరణపై తాము అస్పష్టంగా లేమని చెప్పారు. త్వరలోనే తుది రూపు ఇస్తామని చెప్పారు. అన్ని ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను కలిసి, తెలంగాణ మార్చ్‌లో పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

English summary
Nagam Janardhan Reddy and Harish Rao are lashed out at central home minister Susheel Kumar Shinde for his statement on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X