హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యుపి మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

B. Satya Narayan Reddy
హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ బి.సత్యనారాయణరెడ్డి(86) కన్నుమూశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో సత్యనారాయణరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం అన్నారం గ్రామం. సత్యనారాయణ 1976,81లో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

ఆయన ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నర్‌గా సత్యనారాయణరెడ్డి పనిచేశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన 1927 ఆగస్టు 21వ తేదీన జన్మించారు. 1990-93 మధ్య కాలంలో ఆయన ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు స్వల్ప కాలం గవర్నర్‌గా సేవలందించారు.

ఆయన 1978లో జనతా పార్టీ తరఫున, 1984లో తెలుగుదేశం తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. నిజాం కళాశాలలో చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. హైదరాబాద్‌ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేశారు. అందుకు ఆయన అరెస్టయి ఆరు నెలల పాటు చంచల్‌గుడా జైలులో ఉన్నారు.

ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా వంటి నేతల ప్రభావంతో సోషలిస్టు ఉద్యమంలో చేరారు. వినోబా బావే భూదానోద్యమంలో కూడా పాల్గొన్నారు. సోషలిస్టు పార్టీ, జనతా పార్టీ, లోక్‌దళ్‌ పార్టీల్లో పనిచేశారు. కాంగ్రెసు చట్రానికి వెలుపలే ఆయన రాజకీయాలు నడిచాయి.

English summary
UP former governor B. Satya Narayan Reddy, born 21 August 1927, passed away. He is a freedom fighter, Socialist politician and the former Governor of Uttar Pradesh, Orissa and West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X