వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీష్ గడ్డపై కాలుమోపిన మోడీ: బిజెపిలో ఉత్సాహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Narendra Modi - Nitish Kumar
పాట్నా: రెండేళ్ల తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బీహార్‌లో అడుగు పెట్టారు. మోడికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీ గవర్నర్, బిజెపి సీనియర్ నేత కైలాస్‌పతి మిశ్రా శనివారం మృతి చెందారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు మోడీ పాట్నాకు వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి భారీగా తరలి వచ్చిన బిజెపి కార్యకర్తలు కాబోయే ప్రధాని మోడీయే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పాట్నాకు వచ్చిన నరేంద్ర మోడీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలువలేదు. నరేంద్ర మోడీ రాక బీహార్ బిజెపిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చిందనే చెప్పవచ్చు. మోడీ 2010లో బిజెపి జాతీయ కార్యనిర్వాహక సమావేశాలు జరిగినప్పుడు హాజరయ్యారు. మోడీకి, నితీష్ కుమార్‌కు మధ్య సత్సంబంధాలు లేవు. గతంలో బీహార్ ఎన్నికలు జరిగినప్పుడు నితీష్ కుమార్ మోడీ ప్రచారానికి రావద్దంటూ సూచించారు. ఇరువురి మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో మోడీ రాక ఆసక్తిని రేకెత్తించింది.

మరోవైపు బీహార్‌ను స్పెషల్ కేటగిరి రాష్ట్రంగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ జెడి(యు) పాట్నాలో ర్యాలీ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం బీహార్‌ను నిర్లక్ష్యం చేస్తోందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోపించారు. జెడి(యు) ర్యాలీ పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగింది. ఈ ర్యాలీలో జెడి(యు) ముఖ్యనేతలు నితీష్, శరద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో పొత్తు కలిగి ఉన్న బిజెపిని నితీష్ ఈ ర్యాలీలో నిస్మరించారు.

English summary
Gujarat CM Narendra Modi briefly visited Patna after over two years on Sunday, bringing a surprise boost in the safron party's moral in the state on a difficult day, but he did not come face to face with Bihan CM Nitish Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X