హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు సేన: నోరు చేసుకోవడమే.. (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్టీ రామారావు హయాం నుంచి మీడియాను ఆకట్టుకోవడంపై, మీడియాను మేనేజ్ చేయడంపై ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీలో శిక్షణ ఇవ్వడం ఉంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలను నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న తర్వాత కూడా అది కొనసాగుతోంది. మీడియా ముందు తమ వాదనను ఎలా పెట్టాలి, హావభావాలు ఎలా ఉండాలి, విషయ పరిజ్ఞానం ఎంత ముఖ్యం వంటి అంశాలపైనే కాకుండా చిన్న చిన్న విషయాలపై ప్రత్యేకంగా ఓ అధ్యయంలాంటిది తెలుగుదేశం పార్టీలో సాగుతోంది.

మీడియా ముందు బాగా మాట్లాడే నాయకులకు గుర్తించి, వారికి ఆ పని అప్పగించడం కూడా ఉంది. విషయాన్ని బట్టి మీడియా ముందు మాట్లాడే నాయకుడ్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. తెలుగుదేశం శాససనసభా పక్ష (టిడిఎల్పీ) కార్యాలయం సొంతంగా ఒక లైబ్రరీ వంటిదాన్ని నిర్వహిస్తుంది. మాట్లాడాల్సిన నాయకుడు రావడానికి ముందే టిడిఎల్పీ లేదా పార్టీ కార్యాలయం మీడియా విభాగంలో పనిచేసేవారు విషయాన్నింతా తీసి పెడతారు. దాంతో మీడియా సమావేశానికి ముందు నాయకులు వాటిని అధ్యయం చేస్తారు.

మీడియా ముందుకు వచ్చే నాయకులు మైకు తీసుకున్నారంటే పుల్ స్టాప్ లేకుండా దంచేస్తారు. మధ్యలో మీడియా ప్రతినిధులు వేసే ప్రశ్నలకు అసలు అవకాశం ఉండదు. చివరలో కూడా కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇస్తారు. ఎక్కువగా ప్రశ్నలను ఆహ్వానించరు. తాము చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, వ్యంగ్యంగా, చమత్కారంగా చెబుతారు. ఇందులో ఉద్దండులైన కొంత మంది ఉన్నారు.

బాబు సేన: నోరు చేసుకోవడమే.. (పిక్చర్స్)

యనమల రామకృష్ణుడు ఇప్పుడు చంద్రబాబు తర్వాత పెద్ద దిక్కుగా మారారు. ఆయన హేతుబద్దంగా ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించే ప్రయత్నాలు చేస్తారు. పార్టీ విధానాలను ఆయన చెప్తారు. ఇతర పార్టీల విధానాలను తప్పు పడుతారు. వ్యక్తిగత ఆరోపణలు తక్కువగా ఉంటాయి. ఎర్రంనాయుడు లేని లోటును ఈయనే భర్తీ చేయాల్సి వస్తోంది.

బాబు సేన: నోరు చేసుకోవడమే.. (పిక్చర్స్)

మోత్కుపల్లి నర్సింహులు తన మాటల తూటాలతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన కెసిఆర్‌పై చేసే వ్యాఖ్యలు చాలా సార్లు హద్దులు కూడా దాటుతుంటాయి. అలాగే, దళితుల సమస్య ఏది వచ్చినా ఆయనే మాట్లాడుతారు. ఎస్సీ వర్గీకరణ అయన ప్రత్యేకమైన సబ్జెక్టు.

బాబు సేన: నోరు చేసుకోవడమే.. (పిక్చర్స్)

గాలి ముద్దుకృష్ణమ నాయుడు మీడియా సావీ. ఎన్టీ రామారావు హయాం నుంచి ఆయనకు, మీడియాకు అవినాభావ సంబంధం ఉంది. ఆయన మీడియా ప్రతినిధులతో మంచి సంబంధాలను పెట్టుకుంటారు. వైయస్ జగన్‌పై, ఆయన పార్టీపై ఆయన నిప్పులు చెరుగుతుంటారు. వైయస్సార్ కాంగ్రెసు విమర్శలను తిప్పికొట్టడం ఆయన ప్రధాన విషయంగా మారింది.

బాబు సేన: నోరు చేసుకోవడమే.. (పిక్చర్స్)

తెలుగుదేశం పార్టీకి పయ్యావుల ఒక అసెట్. చాలా త్వరగా ప్రసంగ పాటవాన్ని ఒంట బట్టించుకున్నారు. ప్రత్యర్థులకు సూటిగా ప్రశ్నలు సంధించడంలోనూ, వారికి ఘాటు సమాధానాలు చెప్పడంలో ఆయన అందె వేసిన చేయి. అయితే, ఆయన ధాటిని తట్టుకోలేకనే కావచ్చు, తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆయనను వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఏడ్పించారు.

బాబు సేన: నోరు చేసుకోవడమే.. (పిక్చర్స్)

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది మాట్లాడే విషయంలో ప్రత్యేకమైన శైలి. మెల్లగానే ఆయినా సూటిగా మాట్లాడుతారు. తడుముకోవడం ఉండదు. ఎదురు పార్టీలను ఆయన ఎండగట్టాలని నిరంతరం ప్రయత్నిస్తుంటారు.

బాబు సేన: నోరు చేసుకోవడమే.. (పిక్చర్స్)

రేవంత్ రెడ్డి ఇటీవల చంద్రబాబుకు అంది వచ్చిన ఆయుధమనే చెప్పాలి. కొత్త కొత్త పదాలను సృష్టించి, వాటిని ప్రత్యర్థులకు ఆపాదించి, మాటలను ఈటెల్లా విసురుతారు. నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన ఓ వెలుగు వెలిగారు.

బాబు సేన: నోరు చేసుకోవడమే.. (పిక్చర్స్)

ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో నాగం జనార్దన్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు. తెలంగాణ అంశం గురించి ఏది వచ్చినా ఆయన మాట్లాడాల్సి ఉంటుంది. తెరాసను ఎదుర్కోవడం కూడా ఆయన పనే. అయితే, ఎప్పటికప్పుడు ఆయనకు మోత్కుపల్లి నర్సింహులు అడ్డు వస్తున్నారు.

బాబు సేన: నోరు చేసుకోవడమే.. (పిక్చర్స్)

కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వర రావుది ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ప్రత్యేకమైన శైలి. ఆయన వ్యంగ్య బాణాలు విసురుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీద విరుచుకుపడుతుంటారు.

బాబు సేన: నోరు చేసుకోవడమే.. (పిక్చర్స్)

మరో ఇద్దరు మైకు వీరులున్నారు. వారు బాబూ రాజేంద్ర ప్రసాద్, వర్ల రామయ్య. వీరు తెలుగుదేశం పార్టీకి కాపు కాసే నేతలు. ఎటు దారి తీస్తాయనే ఆలోచన లేకుండా ఆరోపణలు గుప్పించడంలో వారు దిట్ట. మైక్ అందుకుండా ఆగడం అంటూ, ఆలోచన చేయడమంటూ ఉండదు.

ఇంతకు ముందు నన్నపనేని రాజకుమారి మైక్ అందుకుంటే అదరగొట్టే వారు. నిజానికి ఆమెకు మైక్ కూడా అవసరం లేదు. నామా నాగేశ్వర రావు తనదైన శైలిలో తన వాదనను గట్టిగా వినిపిస్తారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తారు. గుంటూరు జిల్లాకు చెందిన కొడెల శివప్రసాద్ రావు వంటివారు కూడా దాటిగానే మాట్లాడుతారు.

రాజ్యసభ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ స్థానం తెలుగుదేశం పార్టీలో ప్రముఖంగా ఉండేది. పార్టీ నుంచి ఓసారి వెళ్లి పోయి తిరిగి రావడం వల్ల కొంత ప్రాధాన్యత తగ్గగా, ఇటీవలి రాజ్యసభ గైర్హాజరు వ్యవహారం మరింతగా ఆయనను దెబ్బ తీసింది. యనమల రామకృష్ణుడికి, దేవేందర్ గౌడ్‌కి మధ్య రెండో స్థానం కోసం పోటీ సాగుతూ వచ్చింది. అశోక్ గజపతిరాజు వంటి వారు అవసరమని భావిస్తే తప్ప మాట్లాడరు.

English summary
Telugudesam party president N Chandrababu naidu has his own team to make verbal attack on political rivals and retaliate them. They are specialized in addressing media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X