హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు అంజిరెడ్డి కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Anji Reddy
హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపక చైర్మన్ కళ్లం అంజిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. ఆయన 1984లో రెడ్డీస్ ల్యాబ్స్‌ను స్థాపించారు. ఆయన 1996లో సామాజిక బాధ్యత నిర్వహణలో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. భారత ఔషధ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.

అంజిరెడ్డి 1940లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో జన్మించారు. నూటక్కిలోని అనపోతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. గుంటూరులోని ఎససి కాలేజీలో డిగ్రీ చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఫార్మాస్యూటికల్స్, ఫైన్ కెమికల్స్‌ అభ్యసించారు. పూణేలోని జాతీయ రసాయన లాబోరేటరీలో కెమికల్ ఇంజనీరింగ్‌లో ఆయన పిహెచ్‌డి చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడిపియల్)లో 1969 - 1975 మధ్య పనిచేశారు. ఆ తర్వాత 1976లో యూనిలాయిడ్స్‌ను ఏర్పాటు చేశారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి ముందు స్టాండర్డ్ ఆర్గానిక్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌ను 25 లక్షల రుపాయల ప్రాథమిక పెట్టుబడితో ప్రారంభించారు.

ఇండియన్ బల్క్ డ్రగ్స్‌లో దేశాన్ని ఎగుమతి చేసే దిశగా తీసుకుని వెళ్లిన ఘనత అంజిరెడ్డికి దక్కుతుంది. అంజిరెడ్డికి కూతురు, కుమారుడు ఉన్నారు. రెడ్డీస్ ల్యాబ్స్ ఔెషధాల ఉత్పత్తిలో భారదేశానికి గుర్తింపు తెచ్చి పెట్టింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ భారతదేశంలో రెండో అతి పెద్ద ఫార్మా కంపెనీగా నిలిచింది. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన సంపన్నుల జాబితాలో అంజిరెడ్డి 64వ స్థానం పొందారు.

English summary
Dr Reddy's labs founder chairman Dr Anji Reddy (73) has passed away. The Reddy's labs is one of the prominent company in Pharmaceutical industry in the World.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X