హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక్కడొద్దు: విజయమ్మ దీక్షపై వీరశివ, స్పీకర్‌కు ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veera Siva Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్షా వేదిక అంశంపై కడప జిల్లా కమలాపురం కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు వీరశివా రెడ్డి బుధవారం మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదల, కోతలను నిరసిస్తూ వైయస్ విజయమ్మ న్యూ ఎమ్మోల్యే క్వార్టర్సులో ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీనిని వీరశివా రెడ్డి తప్పు పట్టారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ న్యూఎమ్మెల్యే క్వార్టర్సులో దీక్ష చేస్తుంటే భద్రత కరువైందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ నేతలకు పరామర్శల పేరుతో అసాంఘీక శక్తులు చొరబడుతాయని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. న్యూఎమ్మెల్యే క్వార్టర్సు వద్ద వారు దీక్ష చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కి, అసెంబ్లీ కార్యదర్శి సదారాంకి ఈ రోజు ఫిర్యాదు చేశారు. వారు వేరేచోట నెల రోజులు దీక్ష చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని చెప్పారు.

నిమ్స్‌లో బిజెపి దీక్ష కొనసాగింపు

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నిమ్స్‌లో దీక్ష చేస్తున్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మధ్యాహ్నం తమ దీక్షను విరమించారు. బిజెపి నేత రవి శంకర్ ప్రసాద్ కిషన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సూచనల మేరకు దీక్ష విరమించామని, ప్రజల్లోకి వెళ్లి పోరాడుతామని వారు చెప్పారు.

విజయవాడ మున్సిపల్ ఆఫీసు ముట్టడి

నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు విశాఖ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ చాంబరులోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుండి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Kadapa district Kamalapuram MLA Veerasiva Reddy has complained to speaker and Assembly secretary on YSR Congress party honorary president YS Vijayamma's deeksha stage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X