• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాజధాని రాకతో విశాఖలో దారి తప్పుతున్న టీడీపీ రాజకీయం.. ప్రత్యామ్నాయాలపై దృష్టి.. ?

|

ఏపీలో మూడు రాజధానుల ప్రకటన వైసీపీకి మంచి మైలేజ్ తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో ఉన్న రెండు అసెంబ్లీ సీట్లతో పోలిస్తే కొత్త రాజధాని విశాఖలో ఉన్న ఐదు సీట్లలో వైసీపీ రాజకీయం అనుకూలంగా మారనుండటం జగన్ కు ఊరటనిస్తోంది. దీంతో టీడీపీ కార్యక్రమాలకు, ఏకంగా అధినేత చంద్రబాబు టూర్ కు సైతం స్ధానిక ఎమ్మెల్యేలు దూరంగా జరిగే స్ధాయిలో విశాఖ రాజకీయం మారిపోయిందంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఊహించవచ్చు.

 విశాఖ రాజధాని ప్రకటన- పరిణామాలు..

విశాఖ రాజధాని ప్రకటన- పరిణామాలు..

వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాస్తో కూస్తో అభివృద్ధి చెందిన నగరంగా ఉన్న విశాఖలో టీడీపీ రాజకీయంగా చాలా బలంగా ఉంది. కొన్నేళ్లుగా నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలు వరుస విజయాలతో ఊపుమీద ఉన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో సైతం నగరంలోని గాజువాక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ను ఓడించిన వైసీపీ.. మిగిలిన నాలుగు సీట్లలో మాత్రం టీడీపీ హవాను అడ్డుకోలేకపోయింది. ఇది గత డిసెంబర్ 17 ముందు వరకూ అక్కడున్న పరిస్ధితి. కానీ అసెంబ్లీలో జగన్ మూడు రాజధానుల ప్రకటనతో పరిస్దితి ఒక్కసారిగా మారిపోయింది.

 విశాఖను వదిలి అమరావతి...

విశాఖను వదిలి అమరావతి...

ప్రపంచంలో ఎక్కడైనా తమ ప్రాంతంలో కొత్తగా ఏదైనా అభివృద్ధి అవకాశం వస్తే కాదనే రాజకీయ నేతలు, పార్టీలు ఉండవు. కానీ విశాఖలో పరిస్ధితి వేరు. అప్పటికే రాజధానిగా ఉన్న అమరావతిని కాదని విశాఖలో రాజధాని ఎలా పెడతారంటూ టీడీపీ ఉద్యమానికి సిద్దమైంది. కానీ అప్పటికే రాజధాని ప్రకటనతో హ్యాపీగా ఉన్న విశాఖ ప్రజలకు అమరావతి రాజధానికి మద్దతివ్వమని కోరలేక, అలాగేని టీడీపీలో ఉంటూ విశాఖ రాజధానిని సమర్ధించలేక అక్కడి ఎమ్మెల్యేలు నలిగిపోయారు. చివరికి మౌనాన్నే ఆశ్రయించడం మొదలుపెట్టారు.

 టీడీపీ నుంచి వైసీపీకి....

టీడీపీ నుంచి వైసీపీకి....

విశాఖలో మారుతున్న రాజకీయ పరిస్ధితులను నిశితంగా గమనిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్, గణబాబు .. మొన్నటి చంద్రబాబు విశాఖ టూర్ కు దూరంగా ఉండిపోయారు. చివరికి ఎయిర్ పోర్టులో చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నా ఆయనకు మద్దతుగా అక్కడికి రాలేదు. మిగిలిన జిల్లాల నేతలు, మాజీ మంత్రులు మాత్రమే అక్కడికి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు దీంతో భవిష్యత్తులో విశాఖ రాజకీయం ఏ మలుపు తీసుకోబోతోందో స్పష్టమైపోయింది. ఇప్పటికే టీడీపీ జిల్లా రూరల్ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబుతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వీరి బాటలోనే త్వరలో ఎమ్మెల్యేలు కూడా పయనిస్తారని భావిస్తున్నారు.

  AP Local Body Polls: No Elections In AP, Supreme court Supports Election Commission!
   ప్రత్యామ్నాయాలపై టీడీపీ దృష్టి..

  ప్రత్యామ్నాయాలపై టీడీపీ దృష్టి..

  రాజధాని ప్రకటన తర్వాత మారిన పరిస్ధితుల్లో విశాఖ నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వెళ్లే అవకాశం ఉందని అనుమానిస్తున్న అధిష్టానం ఇప్పటికే అక్కడ ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. నగరానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కాకపోయినా ఇద్దరు లేదా ముగ్గురు టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశముందని సమాచారం. అదే జరిగితే టీడీపీకి కొత్త రాజధానిలో కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అదే సమయంలో విశాఖపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న వైసీపీకి రాజధాని వస్తున్న వేళ స్ధానిక రాజకీయం అనుకూలంగా మారుతుంది.

  English summary
  after announcement of viskahpatnam as new capital to ap, four local tdp local mlas is looks suffering, recently they have not attended for tdp chief chandrababu naidu's vizag tour and airport episode also. tdp high command are in search for local alternatives for them if they jump into ysrcp.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more