• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కు రెండు ఎకరాలు గిఫ్ట్- అమరావతిపై అదే ప్రేమ: రెమ్యునరేషన్ ఎంత- అంబటి ఫైర్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

పవన్‌ రాజకీయం చేస్తున్నది జగన్‌ను నిందించడానికేనా..స్టీల్‌ప్లాంట్‌పై బీజేపీని పవన్‌ ఎందుకు ప్రశ్నించరంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిలదీసారు. జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష తరువాత చేసిన ప్రసంగం పైన అంబటి స్పందించారు. బీజేపీతో జతకట్టిన పవన్‌కల్యాణ్‌.. స్టీల్‌ప్లాంట్‌పై రాష్ట్రాన్ని నిందిస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్‌ కల్యాణ్‌ ఏ దీక్ష చేసినా ఆవుకథనే వల్లెవేస్తున్నారని ఎద్దేవా చేసారు. విశాఖ ఉక్కు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. గతంలో మోదీని తిట్టిన పవన్‌.. ఇప్పుడు పొగుడుతున్నారన్నారు.

ప్రధాని మోదీలో వచ్చిన మార్పేంటి

ప్రధాని మోదీలో వచ్చిన మార్పేంటి

మోదీలో అప్పటికీ ఇప్పటికీ ఏం తేడా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేసారు. పవన్‌ కల్యాణ్‌ ఏ దీక్ష చేసినా ఆవుకథనే వల్లెవేస్తున్నారని ఎద్దేవా చేసారు. ప్రత్యేక హోదాను వెయ్యి అడుగుల గోతిలో పెట్టిన చంద్రబాబు దానిపై మాట్లాడుతున్నారని. ఇవాళ మరొకాయన మరో నాటకం ఆడారంటూ పవన్ పైన వ్యాఖ్యలు చేసారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తి విశాఖ ఉక్కును వారు విత్ డ్రా చేసుకుంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారన్నారు. ఏ దీక్ష చేసినా జగన్, వైఎస్సార్‌సీపీ మీదే ఆరోపణలు చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తమ పార్టీ మీదే పడుతున్నారని చెప్పుకొచ్చారు.

పవన్ తీసుకొనే రెమ్యునరేషన్ ఎంత

పవన్ తీసుకొనే రెమ్యునరేషన్ ఎంత

వైఎస్సార్‌సీపీకి 151 సీట్లు ఇచ్చారని..తమకు ఇవ్వలేదనే ఆయన బాధని రాంబాబు చెప్పారు. తాము అసెంబ్లీలో తీర్మానం చేశాం, దీక్షలు చేశామన్నారు. మరి పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎందుకు వారిని ప్రశ్నించటం లేదని నిలదీసారు. రాజకీయ వారసత్వాలకే మీరు వ్యతిరేకమా.. సినిమా రంగానికి కాదా అంటూ ప్రశ్నించారు. ప్రజలు, నిర్మాతలు కోరినందునే ఆన్ లైన్ టిక్కెట్లు పెట్టామన్నారు. కొందరి కోసం తాము పనిచేయడం లేదని అంబటి స్పష్టం చేసారు. సినిమాలో నటించినందుకు పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు.

అమరావతిలె రెండెకరాల గిఫ్టు

అమరావతిలె రెండెకరాల గిఫ్టు


దామోదరం సంజీవయ్య ఇప్పుడే గుర్తొచ్చారా... 14 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటిదాకా ఏం చేశారంటూ ఫైర్ అయ్యారు. మంగళగిరి పక్కన రెండు ఎకరాలు గిఫ్టు కొట్టినందుకే అమరావతి రాజధాని కావాలని అడుగుతున్నారంటూ ఆరోపించారు. పవన్ అధికారంలోకి తెమ్మని ప్రజల్ని కోరుతున్నారని... అసలు ఏం చేశారని అధికారం ఇవ్వాలో చెప్పాలన్నారు. విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టటంపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తూనే ఉందని స్పష్టం చేసారు. పవన్ పోరాటం చేయాల్సింది బీజేపితో అని... పవన్‌కి ధైర్యం ఉంటే ప్లకార్డు పెట్టుకుని పార్లమెంటు ఎదుట పోరాటం చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేసారు.

Recommended Video

Lance Naik Sai Teja కు AP సర్కారు ఎక్స్‌గ్రేషియా CBN Demands RS 1 CR || Oneindia Telugu
పవన్ మాట్లాడితే జనం విశ్వసించరు

పవన్ మాట్లాడితే జనం విశ్వసించరు


ఈ దేశంలో ఎన్నికలను ఖరీదైనదిగా చేసిందే టీడీపీ అని రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు దుర్మార్గం చేస్తే పవన్ ప్రశ్నించరని.. జగన్ మంచి చేసినా మెచ్చుకోలేరన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్‌సీపీ అనేక వేదికల మీద పోరాటం చేసిందని గుర్తు చేసారు. లోకేష్‌ని, పవన్ కల్యాణ్‌ను జనం రిజెక్టు చేశారన్నారు. అందుకే ఎక్కడా గెలవలేకపోయారన్నారు. అలాంటి వారు మాట్లాడితే జనం విశ్వసించరున్నారు. 2024లో ఓట్లేయమని అడగటానికే ఇవాళ పవన్ దీక్ష చేసినట్టుందంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఇక, ఇప్పుడు అంబటి వ్యాఖ్యల పైన జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

English summary
YSRCP Senior leader Ambati Rambabu slams Pawan Kalyan on his comments againt YPC in Steel plant issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X