దగ్గర పడిన గడువు: ఇక తెలంగాణలోనే?: ఏపీ స్థానికతకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య తెలుసా?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణలో ఉండి, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడి స్థానికతను కోరిని వారి సంఖ్య అత్యల్పంగా ఉండటం ఆశ్చార్యాన్ని కలిగిస్తోంది. ఏపీ స్థానిక తను కోరేందుకు గడువు మరో 15రోజులు మాత్రమే మిగిలివుండటంతో, చాలా తక్కువ మంది మాత్రమే దరఖాస్తులు చేసుకోవడం అధికార వర్గాలు కూడా విస్మయానికి గురవుతున్నారు.

ఇప్పటి వరకు కేవలం 850మంది మాత్రమే ఏపీ స్థానికతను కోరుకోవడం గమనార్హం. వాస్తవానికి విభజన తర్వాత మూడేళ్లలోపు ఏపీకి వెళ్లిన వెళ్లిన ప్రతీ ఒక్కరికీ స్థానికత కల్పించేలా ప్రభుత్వం అంగీకరించింది. ఆ తర్వాత జూన్ 2, 2017లోపు ఏపీలో 13జిల్లాల్లో ఎక్కడైనా నివాసం ఏర్పరచుకుని, మీ సేవలో దరఖాస్తు చేస్తే స్థానికత లభిస్తుంది.
ఈ అధికారం ఆయా ప్రాంతాల ఎమ్మార్వోలకు ఇవ్వడం జరిగింది.

Andhra Pradesh locality applications are too low

అయితే, అత్యధిక మండలాల్లో కనీసం ఒక్కరు కూడా స్థానికతను కోరకపోవడం గమనార్హం. ఇక ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు ఇప్పుడిప్పుడే ఏపీకి వస్తుండటం, 9,10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు ఇంకా హైదరాబాద్‌ను వీడకపోవడం కూడా ఇందుకు ఓ కారణంగా తెలుస్తోంది.

కొత్త పరిశ్రమలు వస్తే మరింత ఉపాధి లభించి వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతుందన్న అంచనాలతో స్థానికత గడువును మరో రెండేళ్లపాటు పొడిగించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇక చాలా మంది సామాన్యులకు స్థానికత మార్పుపై అవగాహన లేకపోవడం కూడా దరఖాస్తులు ఎక్కువగా రాకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. మరికొందరు పిల్లల చదువులు, తమ ఉద్యోగాల కోసం తెలంగాణలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Andhra Pradesh locality applications are too low.
Please Wait while comments are loading...