వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా-ఒడిశా బోర్డర్ రగడ .. ఏపీ అంగన్‌వాడీ కేంద్రం సీజ్ చేసిన ఒడిశా ఎమ్మార్వోపై కేసు పెట్టమన్న జగన్ సర్కార్ !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల మధ్య సరిహద్దు భూభాగ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోందా ? ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాలపై వివాదం కొనసాగుతుండగానే, మాణిక్య పట్నం గ్రామపంచాయతీ పరిధిలో అంగన్వాడీ కేంద్రాన్ని సీజ్ చేసి ఒరిస్సా మరో పంచాయతీకి తెరలేపిందా ? అంగన్వాడి కేంద్రాన్ని సీజ్ చేయడంపై విచారణ జరిపిన ఏపీ సర్కార్ ఒడిశా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోందా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

ఏపీకి సరిహద్దు రాష్ట్రాలతో పంచాయితీ ..ఇటు తెలంగాణాతో, అటు ఒడిశాతో

ఏపీకి సరిహద్దు రాష్ట్రాలతో పంచాయితీ ..ఇటు తెలంగాణాతో, అటు ఒడిశాతో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరిహద్దు రాష్ట్రాలతో పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల రగడ కొనసాగుతుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో భూభాగంపై వివాదం తలనొప్పిగా మారుతోంది. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులోని విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని కొఠియా గ్రామాలపై ఒడిశా పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 34 కొఠియా గ్రామాలను తమవే అని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

 శ్రీకాకుళం జిల్లాలో మాణిక్యపట్నం గ్రామంలో అంగన్ వాడీ కేంద్రాన్ని సీజ్ చేసిన ఒడిశా అధికారులు

శ్రీకాకుళం జిల్లాలో మాణిక్యపట్నం గ్రామంలో అంగన్ వాడీ కేంద్రాన్ని సీజ్ చేసిన ఒడిశా అధికారులు

ఇదిలా ఉండగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా సిక్కోలు ప్రాంతంలో సరిహద్దు గ్రామమైన మాణిక్యపట్నం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఇటీవల ఒడిశా రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఏపీ అంగన్వాడీ కేంద్రం తమ భూభాగంలో ఉందని చెప్పారు . దీనిపై విచారణ జరిపిన ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాన్ని సీజ్ చేసిన సదరు ఒడిశా ఎమ్మార్వోపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొఠియా గ్రామాల విషయంలో ఒడిశా సర్కారు తీరుపై ఆగ్రహంతో ఉన్న ఏపీ సర్కార్ మరోమారు అంగన్వాడీ కేంద్రాల సీజ్ ఘటనతో ఒడిశా సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఒడిశా రెవెన్యూ అధికారిపై కేసు నమోదు చెయ్యాలని ఆదేశం

ఒడిశా రెవెన్యూ అధికారిపై కేసు నమోదు చెయ్యాలని ఆదేశం

సరిహద్దు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు చేయడంపై సీరియస్ గా ఉన్న సర్కార్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మాణిక్యపట్నం గ్రామాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు సందర్శించారు. ఒడిశా అరాచకాలపై మౌనంగా ఉండడంపై ఏపీ పోలీసులు, రెవెన్యూ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర భూభాగంలోకి వచ్చి అంగన్వాడీ కేంద్రాన్ని సీజ్ చేయడం, అలాగే అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్త భర్తను అరెస్టు చేయడంపై మండిపడిన ఆయన సీజ్ చేసిన ఎమ్మార్వోపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

ఏపీ - ఒడిశా బోర్డర్ గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఒడిశా యత్నం

ఏపీ - ఒడిశా బోర్డర్ గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఒడిశా యత్నం

తాజా వివాదం చోటుచేసుకున్నప్పటి నుండి ఒడిశా ఆంధ్ర భూభాగంలో క్రమంగా దౌర్జన్యాలకు పాల్పడుతోందని సమాచారం. సరిహద్దు గ్రామాల్లో పెత్తనం చెలాయించడానికి చూస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో ఆధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందని తాజా పరిణామాలతో తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఏపీ ఒడిశా సరిహద్దు గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిహద్దు గ్రామాల్లో ఒడిశా చేస్తున్న దౌర్జన్యాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఒడిశా అధికారుల బారి నుండి కాపాడాలని ఏపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎమ్మార్వో పై కేసు నమోదు చేస్తే మరింత ఉద్రిక్తతలకు అవకాశం ?

ఎమ్మార్వో పై కేసు నమోదు చేస్తే మరింత ఉద్రిక్తతలకు అవకాశం ?

మొన్న అంగన్వాడీ కేంద్రాన్ని సీజ్ చెయ్యటంతో పాటు, అంగన్వాడీ కార్యకర్త భర్త గురునాధం అరెస్టు చేసిన క్రమంలో అతడిని విడిపించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగారు. ఇక ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అధికారుల నివేదిక ఆధారంగా ఈ క్రమంలోనే తాజాగా ఒడిశా ఎమ్మార్వో పై కేసు పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. మళ్లీ ఈ పంచాయితీ ఎక్కడి వరకు వెళుతుంది అనేది వేచి చూడాల్సిందే.

English summary
AP government is serious about seizure Anganwadi Centers in border villages, has decided to take strict action in this regard. Minister Sidiri Appalaraju visited Manikyapatnam village. He was angry with the AP police and revenue officials for remaining silent on the anarchy of Odisha. He directed the police to register a case against Odisha MRO, who had come to Andhra Pradesh and seized the Anganwadi Center.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X