వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి తొత్తులుగా పోలీసులు.. ప్రశ్నిస్తే కేసులా ?.. ఆత్మకూరు ఘటనపై సీఎం రమేష్ సీరియస్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని బీజేపీ ఎం సీఎం రమేష్ విమర్శించారు. చట్టం, నిబంధలు పాటించకుండా అధికార పార్టీ నేతలు ఏం చెబితే అదే గుడ్డిగా చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థకు మచ్చ తెస్తున్నారని మండిపడ్డారు. ఆత్మకూరలో బీజేపీ నేత‌ బిడ్డా శ్రీకాంత్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిచారు. వైసీపీ దాడులు పెచ్చుమీరుతుంటే పోలీసులు చేతులు కట్టుకోని కూర్చుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే కేసులా..?

ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే కేసులా..?


ఏపీలో వైసీపీ నేతల ఆగ‌డాలు పెచ్చుమీరుతున్నాయని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మండిప్డారు. పోలీసులు కూడా వారికి తొత్తులుగా మారార‌ని ఆరోపణలు గుప్పించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నంద్యాల అధ్యక్షుడు బిడ్డా శ్రీకాంత్ రెడ్డిపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలంటూ కమలం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగారు. ఇందులో భాగంగా సీఎం రమేష్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , పార్టీ నేతలు కలిసి విజయవాడలో ధర్నా చౌక్ లో నిరసనకు చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీకి తొత్తులుగా పోలీసులు

వైసీపీకి తొత్తులుగా పోలీసులు

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను భ్రష్టుపట్టించారని సీఎం ర‌మేష్ దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ నేతలు ప్రజలపై రెచ్చిపోతూ దాడులు చేస్తుంటే పోలీసులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. శ్రీకాంత్ రెడ్డికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ముందే గొడవ జరిగిందన్నారు. దాడి చేసిన వారిని వదిలేసి.. గాయపడ్డ బీజేపీ నేతను అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప‌ద్ధ‌తిని మార్చుకోవాల‌ని హెచ్చ‌రించారు.

Recommended Video

TRS Trying To Control Telangana Congress - Maheshwar Reddy | Oneindia Telugu
కేంద్రం సీరియ‌స్

కేంద్రం సీరియ‌స్

ఈ ఘటనను బీజేపీ సీరియస్ గా తీసకుంటుందని వదిలిపెట్టేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం పరిశీలిస్తోందన్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుందని పేర్కొన్నారు. హిందులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే తమ పోరాటాన్ని కొనాగిస్తామని సీఎం రమేష్ స్పష్టం చేశారు.

English summary
CM Ramesh slams to Police and YCP Leader
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X