కాపులకు జగన్ దీపావళి కానుక ... జగన్ కు చంద్రబాబుకు తేడా ఇదే : ఏపీ మంత్రి
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమ పథకాల విషయంలో కాపులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే కాపుల కోసం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గ మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని అందిస్తున్నారు. అయితే తాజాగా కొత్తగా కాపు నేస్తం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఆర్ధిక భరోసా అందించేందుకు నిధులు విడుదల చేశారు.
Recommended Video

కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కాపు నేస్తం
వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి తాము అధికారం చేపట్టిన 13 నెలల పాలనలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు .వివక్షకు తావులేకుండా సంక్షేమ ఫలాలు అందరికి అందుతున్నాయని చెప్పారు . ఇక ఈ క్రమంలో ఎవరైనా సంక్షేమ ఫలాలు అందకుంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన సీఎం జగన్ కొత్త లబ్దిదారులకు కూడా ఇప్పుడు దీపావళి కానుకగా కాపు నేస్తం అందించనున్నారు . ఈ క్రమంలో కాపు నేస్తం పథకానికి అర్హులపైన లబ్దిదారుల జాబితాను సిద్ధం చేసింది ఏపీ సర్కార్ .

సీఎం జగన్ కాపులకు ఇస్తున్న దీపావళి కానుక : మంత్రి చెల్లుబోయిన వేణు
జగన్ ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా 10 రోజుల పాటు రోజుకో పథకం అందించాలని , కొత్త వారికి లబ్ది చేకూర్చాలని సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే .ఈ క్రమంలో కొత్తగా 95,245 మందికి కాపునేస్తం పథకాన్ని వర్తింపజేస్తున్నారు . ఏపీ సర్కార్ కొత్త లబ్ధిదారుల కోసం రూ.142.87 కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కాపునేస్తం ద్వారా నిధులు అందిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు . అంతేకాదు సీఎం జగన్ మోహన్ రెడ్డి కాపులకు ఇస్తున్న దీపావళి కానుక ఇది అని పేర్కొన్నారు .

జగన్ కు చంద్రబాబుకు చాలా తేడా !!
జగన్ సేవకుడిగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నాడని తెలిపారు. బాధల్లో ఉన్న వారిని చూసి జగన్ చలించిపోతారని , మంచి మనసున్న నాయకుడు జగన్ అని పేర్కొన్నారు మంత్రి . ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలు నేరుగా విన్నారని , వాటికి ఇప్పుడు పరిష్కారం చూపిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు . జగన్ కు చంద్రబాబుకు చాలా వ్యత్యాసం ఉందన్నారు . ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వ్యక్తి జగన్ అయితే, హామీల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలోనని దారులు వెతికే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి వేణు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications