కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్‌ను చూడగానే బోరుమన్న అఖిలప్రియ, 'ఇక నంద్యాల, ఆళ్లగడ్డ నావి'

దివంగత భూమా నాగిరెడ్డి మృతి చెందిన విషయం తెలియగానే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం నాడు ఆళ్లగడ్డకు వచ్చారు. రోడ్డు మార్గాన సాయంత్రం 5.45 గంటలకు నంద్యాల చేరుకున్నారు.

|
Google Oneindia TeluguNews

ఆళ్లగడ్డ: దివంగత భూమా నాగిరెడ్డి మృతి చెందిన విషయం తెలియగానే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం నాడు ఆళ్లగడ్డకు వచ్చారు. రోడ్డు మార్గాన సాయంత్రం 5.45 గంటలకు నంద్యాల చేరుకున్నారు.

శోభతో లవ్ మ్యారేజ్, ప్రధానిపైనే పోటీ చేసి మెజార్టీ తగ్గించిన భూమాశోభతో లవ్ మ్యారేజ్, ప్రధానిపైనే పోటీ చేసి మెజార్టీ తగ్గించిన భూమా

సాయంత్రం ఆరున్నర గంటలకు ఆళ్ళగడ్డకు చేరుకున్నారు. భూమా పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భూమా కుమార్తెలు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, మౌనిక, కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డిని పరామర్శించారు.

అఖిల ప్రియ కన్నీళ్లు

అఖిల ప్రియ కన్నీళ్లు

ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వారిని పరిచయం చేశారు. లోకేష్‌ను చూడగానే అఖిలప్రియ కన్నీళ్ళు పెట్టుకున్నారు. అమ్మా.. మీరే ఇలా ధైర్యాన్ని కోల్పోతే ఎలా, మేమంతా మీకు అండగా లేమా, ఓ అన్నగా మీ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవడానికి నేను ఉన్నాను, ధైర్యంగా ఉండండి అని ఓ దార్చారు.

గంటకు పైగా గడిపిన లోకేష్

గంటకు పైగా గడిపిన లోకేష్

గంటకు పైగా భూమా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారు. భూమా దంపతులు చేసిన త్యాగాలు, సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పి 7.45 గంటలకు ఆళ్ళగడ్డ నుంచి బయలు దేరి నంద్యాలకు చేరుకున్నారు. అప్పటికే చీకటి పడటంతో సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేశారు. అక్కడి నుంచి తిరుగు పయనం అయ్యారు.

భూమా బాధపడుతుండేవారన్న చంద్రబాబు

భూమా బాధపడుతుండేవారన్న చంద్రబాబు

అభివృద్ధిలో వెనుకబడిపోయిన నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల గురించి భూమా నాగిరెడ్డి నిత్యం బాధపడుతూ ఉండేవారని, ఈ రెండు ప్రాంతాల్లో సమస్యలపై పలుమార్లు ఆయన తనతో మాట్లాడారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సమస్యలపై చంద్రబాబు..

సమస్యలపై చంద్రబాబు..

నీరు - ప్రగతిపై ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. నంద్యాల, ఆళ్లగడ్డ సమస్యలపైనే దాదాపు గంటపాటు చర్చించారు. ఈ నియోజకవర్గాల్లో రోడ్లు, సాగునీటి సమస్యలు వెంటనే తీర్చాలని అధికారులను ఆదేశించారు.

నంద్యాల, ఆళ్లగడ్డ ఇక నావి.. బాబు

నంద్యాల, ఆళ్లగడ్డ ఇక నావి.. బాబు

నంద్యాల, ఆళ్లగడ్డ ఇకపై తన సొంత నియోజకవర్గాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తానని అన్నారు. నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను పూర్తిగా వెచ్చించాలని సూచించారు. ఏ ఒక్కరికీ తాగు నీటి సమస్య లేకుండా చేయాలన్నారు.

English summary
Telugudesam Party leader and Allagadda MLA Akhila Priya wept at TDP leader Nara Lokesh on Sunday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X