కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో తేలేది నేడే...ఆశావాహుల్లో ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎపి సిఎం విదేశీ పర్యటన ముగించుకొని నేడు రాష్ట్రానికి తిరిగిరానున్నారు..దీంతో కర్నూలు నేతలు గుండెలు డదడలాడుతున్నాయి. అదేంటి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగివస్తుంటే కర్నూలు నేతలు ఆందోళన చెందడమేంటి?...దానికి దీనికి ఏం సంబంధం అనుకుంటున్నారా...ఉంది..అదెలాగంటే...

Recommended Video

Kurnool MLC Elections : YSRCP Confident of Win : TDP Vs YSRCP - Oneindia Telugu

ఇదిలా వుండగా సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత

కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి జనవరి 12 న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే...సో...కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి టిడిపి అభ్యర్థి ఎవరనేది చంద్రబాబు నేడు ఖరారు చేయనున్నారు. అదే చంద్రబాబు రాకకు వారి ఆందోళనకు కారణం. ఇక ఆందోళన దేనికంటే ఆ స్థానానికి పోటీ ఎక్కువగా ఉండటం.

 స్థానిక సంస్థల స్థానం...

స్థానిక సంస్థల స్థానం...

ఈ ఎమ్మెల్సీ స్థానం స్థానిక సంస్థలది. నంద్యాల శాసనసభ ఉపఎన్నికల సందర్భంలో టిడిపిని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం ఎమ్మెల్సీ కావడంతో ఆ స్థానానికి ఈ బై ఎలక్షన్ జరుగబోతోంది.

 ఏకాభిప్రాయం రాలేదు..

ఏకాభిప్రాయం రాలేదు..

నిజానికి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లేముందే ఈ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ఖరారు చెయ్యాలని చూశారు. అందుకే గత శనివారం రాత్రి మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రెండున్నర గంటలపాటు ఆయన కర్నూలు జిల్లా నేతలతో సమావేశమయ్యారు కూడా. అయితే ఈ భేటీలో అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆయన నిర్ణయించారు.

 పోటీ ఎక్కువ...

పోటీ ఎక్కువ...

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలో ఓటర్లు కావడం గమనార్హం. దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని తేలిగ్గా గెలవగలమన్న ధీమాలో టీడీపీలో ఉంది. విజయావకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ పదవి కోసం నాయకుల మధ్య పోటీ అత్యంత తీవ్రంగా ఉంది. ప్రధానంగా మొత్తం ఐదుగురు నేతలు ఎమ్మెల్సీ టికెట్‌ కోసం పోటీపడుతున్నారు.

 ఎన్నికలు ఇలా...

ఎన్నికలు ఇలా...

ఈనెల 19 నుంచి 26 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరిస్తారు. 27న వాటి పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుంది. జనవరి 12న జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. 16న కౌంటింగ్‌ ఉంటుంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ వ్యవహరించనున్నారు.

English summary
amaravathi: Kurnool MLC candidate will decide by Chandrababu on today. Local bodies are voters in this election.In fact, before Chandrababu went to a foreign trip,but not possible. Then He decided to take a decision on this issue after returning from a foreign tour. January 12th Elections will be held in three revenue divisions in the kurnool district. Counting on 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X