టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను తిరుపతికి రాలేదన్న చంద్రబాబు , ఎందుకు వచ్చారో తెలుసా !!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ పై నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసింది గోరంత, దోచింది కొండంత అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అరాచక శక్తులను అడ్డుకునే ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు.
టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను తిరుపతికి రాలేదు వైసీపీ అరాచక పాలన అడ్డుకునేందుకు ప్రజల మద్దతు కోసం వచ్చానన్నారు.

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగుతుందన్న చంద్రబాబు
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తిలో ప్రసంగించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్మాద మాఫియా, అరాచక పాలన సాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. పదవుల కోసం ఈ ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను రాలేదని ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రజలు తీసుకోవాలని అడిగేందుకు వచ్చానన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మతసామరస్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి
రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాలని కోరిన చంద్రబాబు ,తమ ప్రభుత్వంలో ఏనాడూ ఆలయాలు, మసీదులు, చర్చిల మీద దాడులు జరగలేదని ,కానీ ప్రస్తుత ప్రభుత్వంలో దాడులు నిత్యకృత్యంగా మారాయని విమర్శించారు. రామతీర్థం లో రాముడు తల తీసేసిన వాళ్ళని పట్టుకోకుండా , దానిపై ప్రశ్నించినందుకు నాపై కేసులు పెట్టారన్నారు. వీళ్ళకు ఎందుకు అంత కండకావరం అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇక కుప్పం లోనూ దేవుడిని తీసుకువచ్చి బయట పడేశారని ప్రశ్నించిన టిడిపి నేతలపై కేసులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు .

ఇంతకాలం నా మంచితనాన్నే చూశారు , ఇకపై కఠిన నిర్ణయాలను చూస్తారు ఖబడ్దార్
స్థానిక ఎన్నికల్లో బెదిరించి ఏకగ్రీవాలు పాల్పడుతున్నారని ప్రశ్నించడం కోసం వెళ్లిన తనను ఎయిర్ పోర్ట్ లోనే 10 గంటల పాటు అడ్డుకున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు తాము ఇదే విధంగా ప్రవర్తించి ఉంటే వైసీపీ నేతలు బయట తిరిగే వారా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఇంతవరకు నా మంచితనాన్ని చూశారని ఇక పైన కఠిన నిర్ణయాలను కూడా చూస్తారు ఖబడ్దార్ అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

అప్పులు చేసి భవిష్యత్ తరాలను కష్టాలలోకి నెడుతున్నారు
వైసీపీ నేతలు ఎక్కడికక్కడ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సంపదను సృష్టించకుండా, అప్పులు చేసుకుంటూ పోవడం భవిష్యత్ తరాలను కష్టాల్లోకి నెడుతోంది అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైన్ షాప్ లన్ని జగన్మోహన్ రెడ్డి వేనని ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో దొరుకుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ సర్కార్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుందన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు నాయకులపై విచారణ జరపడానికి జగన్ కు దమ్ము ఉందా అని ప్రశ్నించారు.
Recommended Video

ఆ సమస్యలపై జగన్ నోరు ఎందుకు మెదపటం లేదు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్క సమస్య పైన అయినా మాట్లాడుతున్నారా ప్రశ్నించిన చంద్రబాబు, ప్రత్యేక హోదా పై జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నాడని దానికి ప్రత్యేక హోదా సాధించే వాళ్లు కావాలని చంద్రబాబు పేర్కొన్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ , విశాఖ రైల్వే జోన్ , ప్రత్యేక ప్యాకేజీలపై ఇంతవరకు జగన్ ఎందుకు నోరుమెదపడం లేదో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పనబాక లక్ష్మి అనుభవం ఉన్న నాయకురాలని , సమస్యలను పరిష్కరించే శక్తి ఉన్న మహిళ అని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని అన్ని రంగాలలోనూ వెనుకబాటుతనానికి గురవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications