రూ.152 కోట్లు జఫ్తు చేశాం: జగన్ ఆస్తులపై ఈడీ ఝలక్, హైకోర్టుకు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ భారతి సిమెంట్స్ సంస్థకు చెందిన రూ.152.85 కోట్లను జఫ్తు చేశామని, ఈ సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఈడీ అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఈడి హైకోర్టును ఆశ్రయించింది.

ఈ నిధులను ఈడికి చెందిన అకౌంట్లకు బదలాయించామని హైకోర్టుకు తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈ నిధులను జప్తు చేశామని ఈడీ తెలిపింది.

ED challenges in High Court over Bharathi Cements assets attach

తమ సొమ్మును ఈడీ అకౌంట్స్‌కు బదలాయించారని భారతి సిమెంట్స్ సంస్థ అప్పిలేట్ అథారిటీ ఆఫ్ ఈడీ వద్ద పిటిషన్‌ను గతంలో దాఖలు చేసింది.

ఫిబ్రవరి 7వ తేదీన ఈ కేసును విచారించిన ఈడీ అథారిటీ ఈ సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఈడీని ఆదేశించింది. అనంతరం ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇడి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Enforcement Directorate on Thursday challenged in High Court over Bharathi Cements assets attach issue.
Please Wait while comments are loading...