వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమానవీయం.. వృద్ధురాలి దహనసంస్కారాలపై రెండు గ్రామాల మధ్య ఘర్షణ; అసలేం జరిగిందంటే!!

|
Google Oneindia TeluguNews

పార్వతీపురం మన్యం జిల్లాలో అమానవీయం ఘటన చోటు చేసుకుంది. మరణించిన ఒక వృద్ధురాలి దహన సంస్కారాలు నిర్వహించటానికి స్మశానానికి వెళ్లిన కుటుంబ సభ్యులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దహన సంస్కారాలు నిర్వహించటానికి వీల్లేదంటూ వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

మృతి చెందిన వృద్ధురాలు.. వరద ముంపులో స్మశానం

మృతి చెందిన వృద్ధురాలు.. వరద ముంపులో స్మశానం

కొమరాడ మండలం కొత్త కల్లి కోట గ్రామం నాగావళి నది ఉప్పొంగటంతో నాగావళి వరదలతో వరద ముంపులో చిక్కుకుంది. ఇదే సమయంలో కొత్త కల్లి కోట గ్రామంలో ఓ వృద్ధురాలు మరణించింది. ఇక మరణించిన వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించడానికి వీలులేని పరిస్థితి స్మశానంలో నెలకొంది. స్మశాన వాటిక కూడా పూర్తిగా వరదనీటి ముంపుకు గురి కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు కుటుంబ సభ్యులు. నాగావళికి వరదలు ముంచెత్తడంతో కొత్త కల్లి కోట గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

మృతురాలి దహన సంస్కారాలపై గొడవ .. రెండు గ్రామాల మధ్య ఘర్షణ

ఇక దీంతో మరణించిన వృద్ధురాలి మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి మృతురాలి బంధువులు, గ్రామస్తులు పాత కల్లికోట స్మశాన వాటికకు తరలించారు. ఇక అక్కడే ఘర్షణ మొదలైంది. పక్క గ్రామం వారు తమ గ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించడానికి వీల్లేదని పాత కల్లికోట గ్రామస్తులు, కొత్త కల్లికోట గ్రామస్తులను అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. శవాన్ని తమ గ్రామంలోని స్మశానవాటికలోకి అనుమతించేది లేదని పాత కల్లికోట గ్రామస్తులు, మృతదేహాన్ని వెనక్కి తీసుకు వెళ్ళేది లేదని, అక్కడే వదిలి పెట్టి వెళతామని కొత్త కల్లికోట గ్రామస్తులు గొడవకు దిగారు.ఇక శవాన్ని పక్కన పెట్టి ఇరు గ్రామాల ప్రజలు గొడవకు దిగటంతో గందరగోళం నెలకొంది.

పాత కల్లికోట ప్రజలను ఒప్పించి దహన సంస్కారాలు చేయించిన అధికారులు

పాత కల్లికోట ప్రజలను ఒప్పించి దహన సంస్కారాలు చేయించిన అధికారులు


ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా రెండు గ్రామాల ప్రజల ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఈ విషయం తెలిసిన అధికారులు చొరవ తీసుకొని ఇరు గ్రామాల వారితో మాట్లాడారు. వరద ముంపుకు గురైన కొత్త కల్లికోట గ్రామంలో పరిస్థితిని వివరించి, వారికి సర్దిచెప్పి, అధికారుల సమక్షంలో పాత కల్లికోట గ్రామంలో వృద్ధురాలి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఇరుగు పొరుగు గ్రామాలు కష్టాల్లో సహాయం చేసుకోవాలని చెప్పిన అధికారులు

ఇరుగు పొరుగు గ్రామాలు కష్టాల్లో సహాయం చేసుకోవాలని చెప్పిన అధికారులు


ఒక గ్రామంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, పొరుగు గ్రామ ప్రజలు కాస్త సహకారం అందిస్తే, ఒకరికొకరు చేదోడువాదోడుగా నిలిస్తే బాగుంటుందని, వారి గ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటే, ఈ గ్రామానికి ఎందుకు వస్తారు అని అధికారులు పాత కల్లికోట గ్రామస్తులకు నచ్చజెప్పారు. కష్టాల్లో ఉన్న సమయంలో పరస్పర సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇరు గ్రామాల ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.

English summary
in Parvathipuram Manyam district kotta Kallikota cemetery was inundated due to floods, a clash took place between the people of the two villages as the villagers stopped those who went to cremate the old woman in the patha Kallikota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X