హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం: బాలికపై మైనర్ల రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sexual assault
హైదరాబాద్: ఓ ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాదులోని వనస్థలిపురం మన్నెగూడలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలక్‌పేటకు చెందిన ఓ యువతి(16) ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమె ఇంటి పక్కనే సాయికిరణ్ అనే యువకుడు నివాసముంటున్నాడు. అతడితో యువతికి ముఖ పరిచయం ఉంది.

నిరుడు డిసెంబర్ 21న కళాశాల నుంచి ఇంటికి వెళుతుండగా యువతి ఫోన్‌కు మన్నెగూడ బస్టాపు వద్దకు త్వరగా రావాలని అని సమాచారం వచ్చింది. దీంతో ఆమె ఆర్టీసీ బస్సులో మన్నెగూడకు వచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న సాయికిరణ్ అతడి స్నేహితుడు మణికిరణ్ ఆమెను బలవంతంగా చెట్ల తోపుల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం జరిపారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు.

దాంతో భయపడిన యువతి ఇంటికి వచ్చి ఒంట్లో బాగాలేదని పడుకుంది. పది రోజుల నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో యువతి జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయికిరణ్, మణికిరణ్‌లతో పాటు వారికి సహకరించిన శ్రీనివాస్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బాలికపై మైనర్ల అత్యాచారం

బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగింది. కృష్ణానగర్‌కు చెందిన ఓ బాలిక(14) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. సోమవారం ముగ్గురు బాలురు ఆమె వద్దకు వచ్చి ఆడుకుంటున్నట్టు నటించారు.

అనంతరం తండ్రి పిలుస్తున్నాడని బాలికను మల్లారెడ్డి ఆసుపత్రి వద్ద ఉన్న పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం జరిపారు. ఏడ్చకుంటూ వచ్చిన ఆ బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు, స్థానికులకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు మైనర్లలను పట్టుకొని చితక బాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
An Intermediate student was gangraped by three youngsters at Vanasthalipuram 20 days ago. The incident came to light on Monday after the victim's family lodged a complaint with the police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X