అంతా లగడపాటి వల్లే, నేనూ విన్నా.. కిరణ్ రెడ్డి చెప్పాల్సిందే: జెడి శీలం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం మంగళవారం నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని ముంచింది లగడపాటియేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌కు షాక్, టిడిపిలో చేరేందుకు ముగ్గురు ఎమ్మెల్యేల ఉత్సాహం

లగడపాటి ఎందుకొచ్చారో తెలియదు

లగడపాటి ఎందుకొచ్చారో తెలియదు

మంగళవారం జెడి శీలం ఏపీ సచివాలయానికి వచ్చారు. లగడపాటి కూడా సచివాలయానికి వచ్చిన విషయాన్ని విలేకరులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లగడపాటి ఎందుకు వచ్చారో తనకు తెలియదని, అయినా పార్టీని ముంచింది ఆయనే అని చెప్పారు.

  Lagadapati Rajgopal meeting with Chandrababu 'టిడిపిలో చేరిక'పై లగడపాటి ట్విస్ట్ | Oneindia Telugu
  నేను పార్టీ మారను, పాత మిత్రులను కలిసేందుకు వచ్చా

  నేను పార్టీ మారను, పాత మిత్రులను కలిసేందుకు వచ్చా

  పార్టీ మారుతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని జెడి శీలం చెప్పారు. సచివాలయ ప్రారంభోత్సవ సమయంలో కొన్ని కారణాల వల్ల తాను రాలేకపోయానని చెప్పారు. ఇప్పుడు చూడటానికి, పాత మిత్రులను కలిసి వెళ్లడానికి వచ్చానని చెప్పారు.

  బాబు అపాయింటుమెంట్ తీసుకుంటా, సచివాలయం భేష్

  బాబు అపాయింటుమెంట్ తీసుకుంటా, సచివాలయం భేష్

  త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపాయింటుమెంట్ తీసుకొని కలుస్తానని జెడి శీలం చెప్పారు. ఇప్పుడు చంద్రబాబును కలవడం లేదన్నారు. తక్కువ సమయంలో కట్టినా తాత్కాలిక సచివాలయం బాగుందని, పరిసరాలు ఆహ్లాదంగా ఉన్నాయని ప్రశంసించారు.

  తలకు మించి భారం కష్టమే

  తలకు మించి భారం కష్టమే

  సచివాలయ భవనాలు చూడ్డానికి చాలా బాగున్నాయని, ఈ ప్రాంతం ఆహ్లాదంగా ఉందని జేడీ శీలం వ్యాఖ్యానించడం గమనార్హం. రాజధాని ప్రాంతాన్ని చూడాలనే ఆసక్తితో తొలిసారిగా వచ్చానని జెడి శీలం చెప్పారు. తలకు మించిన భారం.. హామీలు ఎక్కువ ఇచ్చారని, అమలులో ఎవరికైనా కష్టంగానే ఉంటుందని టిడిపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

  కిరణ్ కుమార్ రెడ్డిపై..

  కిరణ్ కుమార్ రెడ్డిపై..

  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ పార్టీలోకి (కాంగ్రెస్) వస్తున్నారనే ఊహాగానాల పైనా జేడీ శీలం స్పందించారు. నేను కూడా విన్నానని, ఆయన ఎందుకు వెళ్లారు? వారికి పార్టీ ఏం తక్కువ చేసిందో చెప్పి రావాలని తేల్చి చెప్పారు. పిసిసి అధ్యక్షుడు మార్పు విషయంపై మంగళవారం నాటి సమావేశంలో చర్చ జరగలేదన్నారు. పార్టీ బలోపేతంపైనే చర్చించామన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress Party senior leader and Former MP JD Seelam on Tuesday lashed out at Former Chief Minister Kiran Kumar Reddy and former MP Lagadapati Rajagopal. He visited AP secreteriate.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి