వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు షాక్: భరోసా ఇచ్చిన బాబు, టిడిపిలోకి బుట్టా రేణుక?

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కర్నూల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు వైసీపీ చీఫ్ జగన్ స్పష్టత ఇవ్వనందున బుట్టా రేణుక టిడిపిలో చేరాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయమై బుట్టా రేణుక నుండి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

కర్నూల్ జిల్లాలో వైసీపీ నుండి కొందరు నేతలు టిడిపిలో చేరనున్నారని గత వారం ప్రచారం సాగింది. ఈ ప్రచారం నేపథ్యంలో కర్నూల్ జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ చర్చించారు.

నంద్యాల ఎఫెక్ట్: జగన్‌కు బుట్ష రేణుక షాక్, కోట్లకు బంపర్ ఆఫర్నంద్యాల ఎఫెక్ట్: జగన్‌కు బుట్ష రేణుక షాక్, కోట్లకు బంపర్ ఆఫర్

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో సమావేశం తర్వాత తామంతా వైసీపీలోనే కొనసాగుతామని ప్రకటించారు.టిడిపిలో చేరడం లేదన్నారు. అయితే బుట్టా రేణుక మాత్రం వైసీపీని వీడుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నంద్యాల ఎంపీ ఎస్‌పివై రెడ్డితో సహ కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలవడం అప్పట్లో సంచలనం కల్గించింది.

ఎస్‌పివై రెడ్డి టిడిపిలో కొనసాగుతున్నారు. బుట్టా రేణుక మాత్రం వైసీపీలోనే ఉన్నారు. గతంలో కూడ పలు మార్లు బుట్టా రేణుక టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగింది.

 టిడిపిలో చేరనున్న బుట్టా రేణుక?

టిడిపిలో చేరనున్న బుట్టా రేణుక?


కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు ఆమె ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని టిడిపి వర్గాలు కూడా కొట్టిపారేయడం లేదు.అయితే వైసీపీని వీడి టిడిపిలో చేరే విషయమై బుట్టా రేణుక నుండి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పార్టీ మారే విషయంలో బుట్టా రేణుక నుండి స్పష్టత రావాల్సి ఉంది.

వైసీపీ నుండి టిడిపిలో చేరేందుకు కారణమిదే

వైసీపీ నుండి టిడిపిలో చేరేందుకు కారణమిదే

2019 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానంలో పోటీ చేసేందుకు తనకే టికెట్‌ ఖరారు చేయాలని ఎంపీ రేణుక వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను ఇటీవల జరిగిన కర్నూల్ జిల్లా నేతల సమావేశంలో కోరితే స్పష్టత ఇవ్వలేదని సమాచారం.బీసీలకే టికెట్‌ ఇద్దామనుకుంటున్నాం కదా... మీరే ఉన్నారు కదా! అని మాత్రమే జగన్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

అలాగే పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చును స్వయంగా భరించే పరిస్థితిలో ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చును భరించలేనని రేణుక జగన్ దృష్టికి తీసుకెళ్ళారంటున్నారు. దీంతో కర్నూల్ ఏంపీ టిక్కెట్టు విషయంలో ఆమెకు స్పష్టత రాని కారణంగానే వైసీపీని వీడాలని నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.

కర్నూల్ ఎంపీ టిక్కెట్టు ఇచ్చేందుకు టిడిపి సుముఖత

కర్నూల్ ఎంపీ టిక్కెట్టు ఇచ్చేందుకు టిడిపి సుముఖత

2019 ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఖర్చును భరించాలని వైసీపీ చీఫ్ జగన్ బుట్టా రేణుకకు చెప్పారంటున్నారు. అయితే ఆర్థిక పరిస్థితులను రేణుక జగన్ దృష్టికి తెచ్చారనే ప్రచారం ఉంది.

దరిమిలా ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీచేయాలని బుట్టా రేణుకకు వైసీపీ జగన్ సూచించారని సమాచారం. ఈ పరిస్థితులన్నీ రేణుక వైసీపీ నుండి టిడిపిలో చేరాలని భావిస్తున్నారంటున్నారు. అంతేకాదు కర్నూల్ ఎంపీ స్థానం నుంటి పోటీచేసేందుకు టిడిపి కూడ టిక్కెట్టు ఇచ్చేందుకు సానుకూలంగా సంకేతాలు ఇచ్చిందనే ప్రచారం కూడ సాగుతోంది. దీంతో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం మరోసారి జోరందుకొంది.

ఆపరేషన్ ఆకర్ష్ తిరిగి ప్రారంభమైందా?

ఆపరేషన్ ఆకర్ష్ తిరిగి ప్రారంభమైందా?

ఆపరేషన్ ఆకర్ష్‌ టిడిపి తిరిగి ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీలోకి వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను ఆకర్షిస్తోంది. కర్నూల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులను పార్టీ చేర్చుకొనేందుకు ఆ పార్టీ నాయకత్వం రంగం సిద్దం చేసిందని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే గత వారంలోనే బుట్టా రేణుకతో పాటు పలువురు నేతలు టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే వైసీపీ చీఫ్ జగన్ వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ ప్రచారం ఆగింది. కానీ, బుట్టా రేణుక టిడిపిలో చేరుతారనే ప్రచారం మరోసారి ప్రారంభమైంది. అయితే గతంలో మాదిరిగా రేణుక పార్టీని వీడుతారా? లేదా? అనేది మాత్రం స్పష్టత లేదు.

English summary
There is a spreading a rumour Kurnool Mp Butta Renuka may join in Tdp?, Ysrcp chief Ys Jagan suggested to Butta Renuka to contest Yemmiganur Assembly segment from 2019 elections. so, she planning to join in Tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X