వధువు లావు ఉందని మరో ఐదు లక్షలు అడిగాడు

హైదరాబాదుకు చెందిన పి. విక్రమనాయుడు మాచవరానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. నిశ్చితార్థం కూడా జరిగింది. కట్నంగా పది లక్షల రూపాయలు ఇవ్వడానికి వధువు తల్లిదండ్రులు అంగీకరించి ముందుగా కొంత చెల్లించారు కూడా.
కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా విక్రమనాయుడు వధువుకు ఫోన్ చేసి - మరో ఐదు లక్షల కట్నం ఇవ్వాలని, ఆ సొమ్ము చెల్లించకపోతే 20 కిలోల బరువు తగ్గాలని షరతు పెట్టాడు. ఫిబ్రవరి 6వ తేదీన విక్రమనాయుడు ఆ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు.
మే 12వ తేదీన పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు సిపిఐ నాయకుల సహాయం తీసుకున్నారు. సిపిఐ కార్యదర్శి దోనెపూడి శంకర్ పోలీసులను సంప్రదించారు. సిపిఐ కార్యకర్తలు పోలీసుల వైఖరిని నిరసిస్తూ ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications