వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నందిగామ: కాంగ్రెస్ అభ్యర్ది బాబూరావు, జగన్ దూరం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Nandigama by-poll: PCC Chief take decision today
నందిగామ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. కెసీఆర్ రాజీనామాతో తెలంగాణలోని మెదక్ లోక్ సభ స్దానానికి ఉప ఎన్నిక జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ శాసనసభ స్దానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. దీంతో అభ్యర్దులను వెతికే పనిలో పడ్డాయి పార్టీలు. టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె సౌమ్యను అక్కడ పోటీకి నిలపాలని టీడీపీ నిర్ణయించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండనుంది.

నందిగామ ఉప ఎన్నికలో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్దిగా బి. బాబూరావును బరిలో నిలిపింది. అంతకముందు నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడంది. అక్కడున్న స్దానిక నేతలు దేవినేని నెహ్రూపై పోటీచేయాల్సిందిగా ఒత్తిడి తెస్తూ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిపై కూడా ఒత్తిడి పెంచారు. ఈ ఉప ఎన్నికపై ఓ నిర్ణయం తీసుకోవాలంటూ సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీ నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సి. రామ చంద్రయ్యలకు రఘవీరా సూచించారు. ఈ విషయంపై మంగళవారం పార్టీ సీనియర్ నేతలంతా సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి కృష్ణా జిల్లా నేతలు కూజా హాజరు కానున్నారు.

ఈ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిని నిలపకుంటే త్వరలో రానున్న ఆళ్లగడ్డలో భూమా శోభా నాగిరెడ్డి మృతి కారణంగా ఖాళీ అయిన స్దానంలో ఏం చేయాలనే అర్దం కాక అయోమయ పరిస్దిలో కాంగ్రెస్ ఉంది. నిజం చెప్పాలంటే ఎన్నికల ప్రచారంలో ఉండగా భూమా శోభా నాగిరెడ్డి మృతి చెందారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఫలితాలు చూసినట్లైతే గట్టి పోటీ ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్దిని రంగంలోకి దింపితే కాంగ్రెస్ ఏం చేయాలన్న ప్రశ్న తెలత్తుతోంది. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దు ప్రసాద్ నందిగామలో జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్దిని దింపవద్దంటూ కోరిన విషయం తెలిసిందే. ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో మంత్రి దేవినేని ఉమ మట్లాడారు.

నందిగామలో పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం

కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ స్దానానికి జరగనున్న ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండనుంది. టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతితో జరుగుతున్న ఉప ఎన్నికలో కుటుంబ సభ్యలు నిలబడితే పోటీ పెట్టరాదన్న నిబంధనకు అనుగుణంగా నందిగామలో పోటీ పెట్టడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. త్వరలో ఆళ్లగడ్డలో భూమా శోభా నాగిరెడ్డి మృతితో జరగనున్న ఉప ఎన్నికలో టీడీపీ నుండి కూడా ఇదే వైఖరిని ఆశిస్తున్నట్లు సీనియర్ నేత భూమా నాగిరెడ్డి తెలిపారు. ఆళ్లగడ్డలో దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కుమార్తెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా దింపనున్నారు.

English summary
The by-poll was necessitated following the death of Tangirala Prabhakara Rao for the Nandigama Assembly. TDP president Nara Chandrababu Naidu finalized her name for the Assembly. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X