వైసీపీది తప్పే కానీ.. ఆ మాటలూ..! పవన్ షాకింగ్ కామెంట్స్..!
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో తాజాగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఏపీలో దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు నిరసనలు కూడా చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ స్పందించారు. ఏబీఎన్ పై వైసీపీ దాడుల్ని తప్పుబట్టిన పవన్ కళ్యాణ్ (pawan kalyan).. అదే సమయంలో ఛానల్లో ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలూ సరికాదన్నారు. ఈ సందర్భంగా గతంలో వైసీపీ నేతలు వాడిన భాషను పవన్ గుర్తుచేశారు.
ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యాఖ్యానాలు ఉంటాయని, వాటిపై స్పందించడంలోను ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని పవన్ కళ్యాణ్ కోరారు. విమర్శలను స్వీకరించలేక దాడులకు తెగబడటాన్ని ఎవరూ హర్షించరన్నారు. విమర్శలకు దాడులు సమాధానం కావని, విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలపై చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో పోరాడే అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించిందని గుర్తుచేశారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని స్థితిలో కూడా చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయన్నారు.

పదాలను వాడేముందు వాటికున్న విలువలను గౌరవించాలని జనసేన నేతల్ని పవన్ కోరారు. పదునైన, వ్యంగ్యంతో కూడిన పదాలు వాడినా ఎదుటివారు స్వీకరించేలా ఉండాలన్నారు. ఎదుటివారు హద్దులు మీరి మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులుపెట్టినా చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఏబీఎన్ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ పత్రికలో రాసిన కొత్త పలుకులో ఘాటైన పదాలు ఉన్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. ఏబీఎన్ ఛానెల్ లో ప్రసారమైన వీకెండ్ కామెంట్ ను తాను వీక్షించలేదని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని వైసీపీకి సూచించారు.
-
పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్.. "రెండో జన్మ" అంటూ !! -
వివాదాల 'శాంతి'కి జైలు శిక్ష.. అవినీతి సామ్రాజ్యంపై ఏసీబీ పంజా! -
"యుద్ద చరిత్ర తిరగరాసిన ఇరాన్"-జనసేన నేత ప్రశంసలు..! -
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! -
23 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున..!! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం














Click it and Unblock the Notifications