వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ .. జనసేన వెల్లడి , తాను క్షేమంగా ఉన్నానని ప్రకటన

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . తాజాగా ఆయన అస్వస్థతకు గురైనట్లు గా ఊపిరితిత్తులతో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ , జనసేనాని పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది . చివరిసారిగా వకీల్ సాబ్‌లో కనిపించిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కరోనా మహమ్మారి బారిన పడ్డారు . ఆయన హోం ఐ సోలేషన్లోనే చికిత్స పొందుతున్నట్టు సమాచారం .

పవన్ కళ్యాణ్ కు అస్వస్థత: కొద్ది రోజులుగా క్వారంటైన్ లో జనసేనాని, తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్పవన్ కళ్యాణ్ కు అస్వస్థత: కొద్ది రోజులుగా క్వారంటైన్ లో జనసేనాని, తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్

 పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

అంతకుముందు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సెక్యూరిటీ , అలాగే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న దిల్ రాజు, బండ్ల గణేష్ తదితరులు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు . తిరుపతిలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసి అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు . ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా ఆప్పుడు నాగ్టివ్ వచ్చింది . ఇప్పుడు మళ్ళీ అనారోగ్యంతో బాధ పడుతూ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది.

తన వ్యవసాయ క్షేత్రంలో హోం క్వారంటైన్ లో ఉన్న పవన్ కళ్యాణ్

తన వ్యవసాయ క్షేత్రంలో హోం క్వారంటైన్ లో ఉన్న పవన్ కళ్యాణ్

గత కొద్ది రోజులుగా పవర్ స్టార్ మరియు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో తనను తాను హోం క్వారంటైన్ చేసుకున్నారు . కొద్ది రోజులుగా హోం క్వారంటైన్ లో ఉన్న ఆయనకు ఛాతీలో ఇన్ఫెక్షన్ , ఊపిరి ఆడకపోవటం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళారు . కరోనా పరీక్షలు నిర్వహించగా కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. పవన్ కళ్యాణ్ కు ఖమ్మం కు చెందిన వైరల్ వ్యాధుల నిపుణులు , కార్దియాలజిస్ట్ తంగెళ్ల సుమన్ కరోనా కు చికిత్స అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ అందిస్తున్నారు .

పవన్ కళ్యాణ్ తాజా పరిస్థితి వెల్లడించిన జనసేన

పవన్ కళ్యాణ్ తాజా పరిస్థితి వెల్లడించిన జనసేన

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం స్థిరంగా ఉంది . కరోనా సోకటం వల్లే ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు చిరంజీవి , నాగబాబు తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు . ఇక ఇదే విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది . తాజాగా ఆయన అనారోగ్య పరిస్థితి నేపథ్యంలో పవన్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా తగ్గినా తర్వాత ప్రజల్లోకి వస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు . ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కరోనా సోకిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందా అన్న అనుమానం చాలామందికి వ్యక్తమవుతుంది. అయితే అది అధికారికంగా ఇప్పుడు ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది .

తాను క్షేమంగా ఉన్నానన్న పవన్ కళ్యాణ్

తాను క్షేమంగా ఉన్నానన్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఫాంహౌస్ లోనే వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇక అపోలో నుండి వచ్చిన వైద్య బృందం పవన్ కళ్యాణ్ ను పరీక్షించి ఆయనకు వైద్య సహాయం అందిస్తుంది. ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ త‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, క్షేమంగానే ఉన్నానని , త్వ‌ర‌లో సంపూర్ణ ఆరోగ్యంతో ప్ర‌జ‌లు, అభిమానుల ముందుకు వ‌స్తాన‌ని ప‌వ‌న్ కళ్యాణ్ తెలిపిన‌ట్టు జ‌న‌సేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

English summary
Powerstar Pawan Kalyan, who was last seen in Vakeel Saab, has now tested positive for the novel coronavirus. Reportedly, he is under home quarantine. Earlier on Sunday, several of his close aides contracted the virus. So, the actor and Janasena chief isolated himself at home. A source close to Pawan Kalyan informed that he complained of chest congestion. When he consulted a private hospital, he was found to be Covid-19 positive. According to the source, he is stable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X