మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..!
ఏపీలో అమరావతి రాజధాని స్ధానంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ పై కూటమి నేతలు బూతుపురాణాలు,వ్యక్తిగత దాడులకు దిగడంపై మాజీ మంత్రి పేర్ని నాని (perni nani) ఫైర్ అయ్యారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి, అత్యాశల కారణంగా అమరావతి రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు దివాళా తీయించే మార్గంలోకి నడిపిస్తున్నాడని విమర్శించారు.
వైయస్ జగన్ మావిగన్ ప్రతిపాదనను ఎందుకు తిరస్కరిస్తున్నారో ఇంతవరకు కూటమి నాయకులు చెప్పలేకపోయారన్నారు. నేరుగా సమాధానం చెప్పుకోలేక మంత్రులకు బూతు పాఠాలు రాసిచ్చి, పచ్చి అబద్ధాలు చెప్పించి వైయస్ జగన్ పై వ్యక్తిత్వ హననం చేశారన్నారు. మావిగన్ అంశాన్ని డైవర్టు చేస్తున్నామనే భ్రమల్లో బూతులు, అబద్ధాలతోనే కూటమి నాయకులంతా మావిగన్ కాన్సెప్టును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారన్నారు. ఆ విధంగానే ఇన్నాళ్లూ వాళ్లు చేసిన పాపాలను కడుక్కునే ప్రయత్నం చేశారన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబుకి బూతు బంట్రోతుగా మారిపోయాడని, 73 ఏళ్ల వయసులో చంద్రబాబుని ఎన్టీఆర్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడని, ఆయన్ను ఔరంజేబుతో పోల్చాడన్నారు. ఆయనతో పార్టనర్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబుని అవినీతిపరుడిగా పేర్కొన్నాడని, ఆయన్ను గెలిపిస్తే అవినీతిని ప్రోత్సహించేనట్టేనని ప్రకటన చేశాడని తెలిపారు. చంద్రబాబు కేబినెట్‌లో ఉన్న సగం మంది మంత్రులు ఒకప్పుడు ఆయన్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయన్నారు. 164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబుని తిట్టిన వారి లెక్క వందకి పైనే అన్నారు. చంద్రబాబుని మోడీ, మోడీని చంద్రబాబు దూషించుకున్నారన్నారు.
చంద్రబాబుని దగ్గుబాటు పురందీశ్వరి ఎన్నిసార్లు తిట్టారో లెక్కే లేదన్నారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా చంద్రబాబు గురించి పుస్తకాలే రాశారని, టార్చ్‌లైట్ మినిస్టర్ అని పేరు కూడా పెట్టాడన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలను టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెట్టగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి, చేయాలని, అప్పుడే అందరికీ మంచిదన్నారు.
-
సాయిరెడ్డి సంచలన ప్రకటన, టార్గెట్ ఫిక్స్..!! -
వైసీపీ మాజీ మంత్రికి భారీ షాక్- ఆరు నెలల జైలుశిక్ష..! -
Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!














Click it and Unblock the Notifications