హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ కాన్వాయ్ తొలగింపు: ఏంచేస్తామో చూడండి: ఆనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం శుక్రవారం కిరణ్ కుమార్ రెడ్డి భద్రతను సమీక్షించింది. ఆయన కాన్వాయ్‌ని తొలగించింది. ప్రస్తుతం ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగించింది.

ముఖ్యమంత్రిగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కిరణ్‌కు 5 వాహనాలు, అంబులెన్స్ ఉన్నాయి. వాటిని తొలగించారు. వాటి స్థానంలో ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు రెండు కొత్త టయోటాలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. కిరణ్‌కు మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రతను ఇస్తారు. ఇక నుండి భద్రతను ఒక డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.

Kiran Kumar Reddy

కిరణ్‌పై ఆనం

కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తర్వాత తాము ఏం మాట్లాడుతామో, ఎలా మాట్లాడుతామో మీరే చూస్తారని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డామనే మచ్చ రాకుండా ఉండేందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు.

తాము ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. త్వరలో అందరం సమావేశమై భవిష్యత్తుపై చర్చిస్తామన్నారు. రాష్ట్రపతి పాలన సముచిత నిర్ణయమన్నారు. అవకాశవాదులు, వెన్నుపోటుదారులు, నిలకడలేనివాళ్లు, అజ్ఞానులే పార్టీని వీడుతున్నారన్నారు.

English summary
Intelligence is reviewing on Kiran Kumar Reddy's security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X