అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సర్కార్ పై హైకోర్టు ఫైర్-స్కూళ్ల విలీనం, మూసివేతలపై-ఇంగ్లీష్ మీడియంపైనా కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ సర్కార్ చేపట్టిన స్కూళ్ల విలీనాలు, ముూసివేతల వ్యవహారం అంతకంతకూ తీవ్రమవుతోంది. స్కూళ్లను విలీనం చేయడం ద్వారా కొన్ని స్కూళ్లు మూసేయడం, విద్యార్ధుల్ని తమ ఇళ్లకు దూరంగా ఉన్న స్కూళ్లకు తరలించడం వంటి చర్యల్ని చేపడుతున్నారు. దీన్ని నిరసిస్తూ ఇప్పటికే విద్యార్ధులు, తల్లితండ్రులు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టు ఆగ్రహంతో ప్రభుత్వం వివరణ ఇవ్వడానికి రెండు రోజుల సమయం కోరింది.

Recommended Video

ఏపి ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మరో చుక్కెదురు *Andhrapradesh | Telugu OneIndia
స్కూళ్ల విలీనం, మూసివేతలు

స్కూళ్ల విలీనం, మూసివేతలు

ఏపీలో జాతీయ విద్యావిధానం అమలుతో పాటు ప్రభుత్వం చేపడుతున్న విద్యాసంస్కరణల్లో భాగంగా పలు స్కూళ్లు మూతపడుతున్నాయి. మరికొన్ని స్కూళ్లు విలీనం అయిపోతున్నాయి. దీంతో దశాబ్దాలుగా పిల్లల ఇళ్లకు దగ్గరగా స్కూళ్లు ఉండాలనే వాదనకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సదరు స్కూళ్లలో చదుపుతున్న విద్యార్ధులు, తల్లితండ్రులు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. దీనిపై స్వయంగా సీఎం జగన్ సొంత జిల్లా కడపతో పాటు తూర్పుగోదావరి జిల్లా నుంచి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

సర్కార్ చర్యలపై హైకోర్టు ఫైర్

సర్కార్ చర్యలపై హైకోర్టు ఫైర్

ఏపీలో ప్రభుత్వం విద్యాసంస్కరణల్లో భాగంగా చేపట్టిన స్కూళ్ల విలీనాలు, మూసివేతలు తమకు ఇబ్బందికరంగా మారుతున్నాయని, విద్యార్ధులకు చదువుల్ని దూరం చేస్తున్నాయని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్కరణల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లను విలీనం చేసి మిగతా స్కూళ్లను మూసివేస్తారా అంటూ ప్రశ్నించింది. జాతీయ విద్యావిధానంతో పాటు విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయంటూ హైకోర్టు ఆక్షేపించింది.

 పాఠశాల విద్య నిర్వీర్యమన్న పిటిషనర్లు

పాఠశాల విద్య నిర్వీర్యమన్న పిటిషనర్లు


విద్యాసంస్కరణల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న స్కూళ్ల విలీనాలు, మూసివేతలతో పాఠశాల విద్యావ్యవస్ధ నిర్వీర్యమవుతోందంటూ పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. స్కూళ్లను విభజించాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టీచర్లు, స్కూళ్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ 30 విద్యార్ధులకో టీచర్ ఉండాలని చెబుతున్నా దాన్నీ పట్టించుకోవడం లేదన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి రావడం వల్ల బాలికల్లో డ్రాప్ అవుట్స్ పెరిగే ప్రమాదం పొంచి ఉందని పిటిషనర్లు తెలిపారు.

ఇంగ్లీష్ మీడియం అమలుపై హైకోర్టు వ్యాఖ్యలు

ఇంగ్లీష్ మీడియం అమలుపై హైకోర్టు వ్యాఖ్యలు

రాష్ట్రంలోని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలుపైనా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు గందరగోళంగా ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించారు. 1 నుంచి 8వ తరగతి వరకూ ఒకే మీడియంలో విద్యాబోధన ఉంటుందని చెప్పిన ప్రభుత్వం అది ఏ మీడియం అనేది చెప్పకపోవడాన్ని పిటిషనర్లు ఆక్షేపించారు. అలాగే 9,10 తరగతుల్లో రెండు మీడియాలు ఉంటాయని చెబుతూనే కనీసం 20 మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలని చెప్పడం కూడా తప్పేనన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రాధమిక విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోందని గుర్తుచేసింది. ప్రభుత్వ నిర్ణయం చూస్తుంటే తెలుగు మీడియంలో విద్యాబోధన లేకుండా చేసేలా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

జగన్ సర్కార్ వాదన ఇదే

జగన్ సర్కార్ వాదన ఇదే

అయితే పిటిషనర్ల ఆందోళనలపై స్పందించిన ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం.. నూతన విద్యావిధానం అమలు కోసం వివరాలు మాత్రమే సేకరిస్తున్నామని, స్కూళ్ల తరలింపు, విలీనాలు, మూసివేతలు ఇంకా అమలు చేయలేదని తెలిపారు. రెండు రోజుల సమయం ఇస్తే పూర్తి వివరాలు సమర్పిస్తామన్నారు. అలాగే తెలుగు మీడియం స్కూళ్లు మూసేయడం లేదని, ఇంగ్లీష్ మీడియం మాత్రమే చదవాలని ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు స్టేటస్ కో ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఏజీ ఈ పిటిషన్లను డివిజన్ బెంచ్ కు బదిలీ చేసి విచారణ చేపట్టాలని కోరారు. దీంతో విచారణ నిలిచిపోయింది.

English summary
ap high court has expressed anger on ysrcp govt over schools merger and closure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X