హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్: జివోఎం రిపోర్ట్‌పై మజ్లిస్‌తో టి కాంగ్ జోడీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

T Congress to meet GoM on Law and Order of Hyderabad after division
హైదరాబాద్: విభజన అనంతరం హైదరాబాదు శాంతిభద్రతలు తెలంగాణ గవర్నర్ చేతిలో ఉంచాలని తెలంగాణ నేతలు కోరనున్నారు. హైదరాబాదు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండబోతున్న నేపథ్యంలో నగర శాంతిభద్రతలు తెలంగాణ గవర్నర్ లేదా హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలోని సలహా మండలి పరిధిలో ఉండాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మంత్రుల బృందాన్ని(జివోఎం)ను కోరనుందని తెలుస్తోంది.

నగర పరిధిని కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌కే పరిమితం చేయాలని వారు కోరునున్నారు. హైదరాబాద్, శాంతిభద్రతల విషయంలో మజ్లిస్‌తో కలిసి పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లడంతో పాటు జివోఎంకు ఒకే రకమైన నివేదికలు ఇవ్వాలనే అభిప్రాయంతో టి కాంగ్రెసు నేతలు ఉన్నారట.

మంత్రి జానా రెడ్డి, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ ఇప్పటికే మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీతో పలు అంశాలపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదు శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉండవచ్చుననే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ కాంగ్రెసు నేతలు, మజ్లిస్ నేతలు దీనిపై జివోఎంను తమ అభిప్రాయాన్ని చెప్పనున్నారు.

హైదరాబాదు శాంతిభద్రతలను తెలంగాణ గవర్నర్ చేతిలో ఉంచాలని వీరు కోరనున్నారు. హైదరాబాదు తెలంగాణలో భాగమేనని విభజనతో పాటే తెలంగాణ పోలీసులు పరిధిలోకి పోలీసింగ్ వచ్చేస్తుందని అయితే ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం సీమాంధ్ర పరంగా కూడా సూచనలు తీసుకునేందుకు హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సలహా మంలి వేయవచ్చునను సూచించనున్నారట.

English summary
Telangana Congress leaders will meet GoM soon on law and order of Hyderabad after AP division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X