వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ స్పీకర్‌ పోడియం ఎక్కలేదా : శత్రువులుగా చూస్తారా : కాకానికి టీడీపీ లేఖ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తాజాగా టీడీపీ శాసనసభాపక్ష ఉప నేతల పైన ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసిన చ్యల పైన ఆ పార్టీ స్పందించింది. ఈ నిర్ణయాల పైన తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ తో పాటుగా అసెంబ్లీ కార్మదర్శికి టీడీపీ ఎమ్మెల్యే..ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ లేఖ రాసారు. ప్రభుత్వ విప్ చేసిన ఫిర్యాదు మేరకు విచారించిన ప్రివిలేజ్ కమిటీ టీడీపీ ఉప నేతలు అచ్చెన్నాయుడు.. రామానాయుడుకు అసెంబ్లీలో మైక్ ఇవ్వకూడదని స్పీకర్ కు సిఫార్సు చేస్తూ నిర్ణయించారు.

ఇది ఒక సెషన్ కు మాత్రమే కాదని... ప్రస్తుత అసెంబ్లీ టర్మ్ పూర్తయ్యే వరకూ అమల్లో ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..టీడీపీకి ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో అనధికారికంగా నలుగురు అధికార పార్టీకి దగ్గరయ్యారు. 19 మంది సభ్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అందులో ప్రధానంగా సభలో వాయిస్ వినిపించే తమ నేతలు అచ్చెన్నాయుడు... రామానాయుడు కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండే చేస్తే తమ పార్టీ వాయిస్ వినిపించేదెవరనే చర్చ టీడీపీలో మొదలైంది.

TDP letter to Kakani goverdhan reddy asked to revoke decision on Achamnaidu and Ramanaidu

దీంతో.. తాజాగా ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డికి లేఖ రాసారు. అందులో శాసనసభలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ప్రతిపక్షం ‎ బాధ్యత అంటూ గుర్తు చేాసరు. ప్రజా సమస్యలకు పరిష్కారం కనుగొనే వేదికపై ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ ఉపపక్ష నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు మాట్లాడే అవకాశం లేకుండా చేయడమనేది సరైన విధానం కాదని లేఖలో పేర్కొన్నారు. సభ్యుల వివరణ కూడా తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు.

ప్రజాహితం కోరేవారైవనా ప్రజల తరపున ప్రతిపక్షం నుంచి సూచనలు, సలహాలు కోరుకుంటారు... కానీ ప్రతిపక్షం ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించడమే నేరంగా, ప్రజలపక్షాన మాట్లాడడం ఘోరంగా భావిస్తున్నారన్నాంటూ అసహనం వ్యక్తం చేసారు. ప్రతిపక్ష పార్టీ నేతలను శత్రువులుగా చూసే విధానం ఏమాత్రం సమర్థనీయం కాదని లేఖలో సూచించారు. చట్ట సభల్లో మాట్లాడే అవకాశం లేకుండా చేయడమంటే రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్రం హక్కును నిర్వీర్యం చేయడమే అని చెప్పుకొచ్చారు.

Recommended Video

AP Economic Advisor గా Former SBI Chief Rajnish Kumar | AP CM Jagan || Oneindia Telugu

అదే సమయంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వ్యవహరించిన తీరును లేఖలో ప్రస్తావించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆ పార్టీ నేతలు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మర్చిపోయారా అంటూ అనగాని ప్రశ్నించారు. స్పీకర్‌ పోడియం ఎక్కి ఆందోళనలు చేయలేదా అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయాలుగా చెప్పుకునే చట్టసభల్లో ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని, శాసనసభాపక్ష ఉప నేతలకు మాట్లాడే అవకాశం లేకుండా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించు కోవాలని కోరుతున్నామంటూ అనగాని సత్యప్రసాద్ లేఖలో పేర్కొన్నారు. దీంతో..ఇప్పుడు ఈ లేఖ పైన ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
TDP MLA Anagani Satya Prasad letter to preivelege committee hairamn Kakani Govardhan Reddy on latest decision against TDP dy floor leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X