తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతికి వైఎస్ జగన్: రోడ్ల మీదికి ఎలక్ట్రిక్ బస్సులు

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకుని రావడానికి అవసరమైన చర్యలను ఇదివరకే ప్రభుత్వం చేపట్టింది. వంద బస్సులను ప్రవేశపెట్టనుంది. 140 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. దశలవారీగా సంవత్సరం కాలంలో ఈ వంద బస్సులను కూడా ఆర్టీసీకి అందుతాయి. ఒలెక్ట్రా గ్రీన్‌విచ్ కంపెనీ ఆర్టీసీకి వాటిని అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు గత ఏడాదే లెటర్ ఆఫ్ అవార్డ్‌ను అందజేశారు.

140 కోట్ల రూపాయలతో..

140 కోట్ల రూపాయలతో..

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకుని రావడానికి అవసరమైన చర్యలను ఇదివరకే ప్రభుత్వం చేపట్టింది. వంద బస్సులను ప్రవేశపెట్టనుంది. 140 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. దశలవారీగా సంవత్సరం కాలంలో ఈ వంద బస్సులను కూడా ఆర్టీసీకి అందుతాయి. ఒలెక్ట్రా గ్రీన్‌విచ్ కంపెనీ ఆర్టీసీకి వాటిని అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు గత ఏడాదే లెటర్ ఆఫ్ అవార్డ్‌ను అందజేశారు.

ప్రజా రవాణాలో కాలుష్య నివారణ కోసం..

ప్రజా రవాణాలో కాలుష్య నివారణ కోసం..

ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2) పథకం కింద ఆర్టీసీ ఈ కాంట్రాక్ట్‌ను ఒలెక్ట్రా గ్రీన్‌విచ్‌కు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం.. 12 నెలల పాటు ఈ బస్సుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ఒలెక్ట్రా కంపెనీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త బస్సులన్నింటినీ తిరుపతిలోని అలిపిరి డిపోనకు అప్పగించనుంది. ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా ఆర్టీసీ అధికారులు- ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది.

తొలి విడతలో 50..

తొలి విడతలో 50..

తొలి విడతలో అందే 50 బస్సులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 30వ తేదీన తిరుపతిలో ప్రారంభించనున్నారు. తిరుమల, మదనపల్లి, కర్నూలు మార్గాల్లో ఈ బస్సులు పరుగులు తీస్తాయి. క్రమంగా ఈ సర్వీసులను విస్తరిస్తారు. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, పుణె, నాగ్‌పూర్, సూరత్, డెహ్రాడున్, సిల్వాస, గోవా, హిమాచల్ ప్రదేశ్, కేరళల్లో విద్యుత్ ఆధారిత బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఒలెక్ట్రా సంస్థ.

ఒక్కసారి ఛార్జింగ్‌తో..

ఒక్కసారి ఛార్జింగ్‌తో..

ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు పొడవు తొమ్మిది మీటర్ల ఉంటుంది. సీట్ల సామర్థ్యం 35. లిథియం-ఇయాన్ బ్యాటరీ ఆధారంగా ఇవి నడుస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే- 180 కిలోమీటర్ల వరకు రాకపోకలు సాగించ గలుగుతాయి. ఇది ట్రాఫిక్, రోడ్ కండీషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో అమర్చే లిథియం-ఇయాన్ బ్యాటరీ పూర్తిస్థాయిలో ఛార్జ్ కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయాన్ని తీసుకుంటుంది. అడ్వాన్స్డ్ బ్రేక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందీ బస్సు. ఎయిర్ కండీషన్డ్ బస్సులు ఇవి.

 అద్దె ప్రాతిపదికన..

అద్దె ప్రాతిపదికన..

విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతిల్లో మొత్తం 350 విద్యుత్ బస్సులను న‌డ‌పాల‌ని ఇదివరకే ఏపీఎస్ఆర్టీసీ నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన బ‌స్సుల‌ను నడిపించడానికి ఆర్టీసీ అధికారులు టెండర్లను పిలిచారు. ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ బిడ్డింగ్స్ దాఖలు చేశాయి. ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. తిరుపతిలో కొన్ని బస్సులను నడిపించడానికి ముందుకొచ్చింది.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy will inaugurates APSRTC's Electric buses in Tirupati on April 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X