వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైసా ఖర్చు లేకుండా డాక్టర్, ఇంజినీరింగ్ చదివిస్తా: జగన్, బాబు ఇలాగాలో హారతులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

సిఎం సొంత జిల్లాలో జగన్, సర్వత్రా ఆసక్తి !

చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం చిత్తూరు మదనపల్లి మండలం సీటీఎం నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు.

బాబు పైనే పోటీ చేసి: జగన్‌కు షాకిస్తూ టీడీపీలోకి కీలక నేత, కుప్పంపై ఆసక్తికరంబాబు పైనే పోటీ చేసి: జగన్‌కు షాకిస్తూ టీడీపీలోకి కీలక నేత, కుప్పంపై ఆసక్తికరం

పులవండ్లపల్లి, కాశీరావుపేట, వాల్మికీపురం, ఐటీఐ కాలనీ, పునుగుపల్లి, విఠలం, టీఎం లోయ మీదుగా జమ్మిలవారిపల్లి వరకు పాదయాత్ర సాగుతుంది. ఆయన తన పాదయాత్రలో టిడిపి పైన విమర్శలు గుప్పిస్తూ, అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెబుతున్నారు.

టార్గెట్ జగన్: ఆనం వివేకానంద మౌనం వెనుక, తమ్ముడికి మంత్రి పదవి?టార్గెట్ జగన్: ఆనం వివేకానంద మౌనం వెనుక, తమ్ముడికి మంత్రి పదవి?

 జగన్ యాత్రకు మహిళల హారతులు

జగన్ యాత్రకు మహిళల హారతులు

అంతకుముందు సోమవారం మదనపల్లె నియోజకవర్గంలోని జగన్ పాదయాత్ర చేశారు. నియోజకవర్గ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. గ్రామాల్లో మహిళలు హారతులు పట్టారు. మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముస్లిం మతగురువులు జగన్ పాదయాత్ర సజావుగా సాగాలని కోరుతూ దువా చేశారు.

 జగన్ వెంట విజయ సాయి రెడ్డి

జగన్ వెంట విజయ సాయి రెడ్డి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పల్లెల్లో ఏర్పాటు చేసిన కేకులను కోసి వారికి జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తిప్పారెడ్డి తదితరులు ఉన్నారు.

 వైయస్సార్ పేరుతో బీమా పథకం

వైయస్సార్ పేరుతో బీమా పథకం

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తనకు అధికారం ఇస్తే ఆరోగ్యశ్రీ మరింత విస్తరించడంతో పాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్నా, వైద్యం ఖర్చు రూ.1000 దాటే ప్రతి ఒక్కరికీ పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. రైతులకు, చేనేతలకు వైయస్సార్ పేరుతో బీమా పథకాన్ని కూడా ప్రవేశపెడతామన్నారు.

 పైసా ఖర్చు లేకుండా డాక్టర్, ఇంజనీర్ చేస్తా

పైసా ఖర్చు లేకుండా డాక్టర్, ఇంజనీర్ చేస్తా

పేద, మధ్య తరగతి కుటుంబాలకు కార్పోరేట్ విద్యను అందుబాటులోకి తెస్తానని, పైసా ఖర్చు లేకుండా డాక్టర్, ఇంజనీర్ అయ్యేలా చేస్తానని జగన్ చెప్పారు. వారికి హాస్టల్ ఫీజు, మెస్ ఛార్జీలకు ఏడాదికి రూ.20వేలు ఇస్తానని చెప్పారు.

English summary
With YSR Congress Party (YSRCP) chief Y. S. Jagan Mohan Reddy having covered over 600 kilometres of his targeted 3,000-km Praja Sankalpa Yatra, the party is banking on his mass connect campaign and the legacy of his father Y. S. Rajasekhara Reddy (YSR) to beat the ruling Telugu Desam Party (TDP) in the 2019 Andhra Pradesh assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X