వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీక‌న్నా జ‌న‌సేన‌కే ఎక్కువ భ‌య‌ప‌డుతున్న వైసీపీ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి తెలుగుదేశం పార్టీ. కాబ‌ట్టి వీరిద్ద‌రి మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డ‌వ‌డం స‌హ‌జం. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలుగుదేశం క‌న్నా జ‌న‌సేన పార్టీని చూసే ఎక్కువ‌గా భ‌య‌ప‌డుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అందుకు ప్ర‌ధాన కార‌ణాల‌ను కూడా విశ్లేషించి చెబుతున్నారు.

సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌

సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌


ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏపీ రాజ‌కీయాల్లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా మారారు. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌డంవ‌ల్లే వైసీపీ అధికారంలోకి రాగ‌లిగింద‌నే అంద‌రికీ సుస్ప‌ష్టం. కానీ ఈసారి ఎటువంటి ప‌రిస్థితుల్లోను ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల‌నివ్వ‌న‌ని, సంద‌ర్భానుస‌రాంగా పొత్తుల‌తో ముందుకు వెళ‌తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అంతేకాదు బీజేపీతో మాట్లాడి పొత్తుల‌కు ఒప్పిస్తాన‌న్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఎన్ని ఓట్లు సాధించ‌గ‌లిగింది?

గ‌త ఎన్నిక‌ల్లో ఎన్ని ఓట్లు సాధించ‌గ‌లిగింది?


గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఎన్ని స్థానాల్లో పోటీచేసింది? ఎక్క‌డ ఎన్ని ఓట్లు సాధించ‌గ‌లిగారు? ఈసారి ప‌రిస్థితి ఏమిటి? జ‌న‌సేన‌ను ఎలా బ‌ల‌హీన‌ప‌ర‌చాలి? ఓట్లు చీలిపోయేలా ఎటువంటి వ్యూహం అనుస‌రించాలి? అందుకు త‌గ్గ‌ట్లుగా ఏ నేత‌ల‌ను ఉప‌యోగించుకోవాలి? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు.

టీడీపీక‌న్నా జ‌న‌సేన‌పైనే దృష్టి!

టీడీపీక‌న్నా జ‌న‌సేన‌పైనే దృష్టి!


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి తెలుగుదేశం క‌న్నా జ‌న‌సేన‌పై ఎక్కు వ దృష్టిపెట్టారు. ప‌వ‌న్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. ఇవ‌న్నీ స‌హ‌జంగా జ‌న‌సేన సైనికుల‌కు ఆగ్ర‌హాన్ని క‌లిగిస్తున్నాయి. అంతేకాదు.. ఎట్టి ప‌రిస్థితుల్లోను ఈసారి సాధ్య‌మైన‌న్ని ఎక్కువ సీట్లు సాధించాల‌నే ధృఢ సంక‌ల్పాన్ని క‌లిగివున్నారు. దీనికోసం విజ‌య‌వాడ‌లో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాన‌లు సంయుక్తంగా స‌మావేశ‌మ‌య్యారు. ప‌వ‌న్‌పై వైసీపీవారు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండించారు. రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కోసం అభిమానులంతా సైనికుల్లా ప‌నిచేస్తామ‌ని ప్ర‌తిన బూనారు. మ‌రో నాలుగైదు సార్లు స‌మ‌వేశ‌మ‌వుతామ‌ని, భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ప్ర‌క‌టిస్తామ‌ని మెగా అభిమానులు తెలిపారు.

English summary
YCP more fearful of Janasena than TDP?టీడీపీక‌న్నా జ‌న‌సేన‌కే ఎక్కువ భ‌య‌ప‌డుతున్న వైసీపీ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X