వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: లోబీపీ ని లైట్ తీసుకుంటున్నారా? ప్రాణాంతకం; ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!!

|
Google Oneindia TeluguNews

మన సమాజంలో ప్రస్తుత జీవన విధానం వల్ల చాలా మంది బీపీ బారిన పడుతున్నారు. అత్యధికంగా హైబీపీ బారిన పడుతున్నారు. అయితే లోబీపీ ఉన్నవాళ్ళు కూడా లేకపోలేదు. లోబీపీని పట్టించుకోకుంటే ఒక్కోసారి అది ప్రాణాంతకంగా మారుతుంది. అసలు లోబీపీని ఎలా గుర్తించాలి? లో బీపీ లక్షణాలు ఏంటి? లోబీపీ నుండి బయటపడాలంటే ఏమి చెయ్యాలి వంటి అనేక అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నార్మల్ కన్నా తక్కువగా రోజూ బీపీ ఉంటే లోబీపీ ఉన్నట్టే

నార్మల్ కన్నా తక్కువగా రోజూ బీపీ ఉంటే లోబీపీ ఉన్నట్టే

మనుషుల్లో రక్తపోటు సాధారణంగా 120/80ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే, పరీక్షించిన ప్రతీసారి ఎక్కువే చూపిస్తుంటే హై బీపీ సమస్య ఉన్నట్టు గ్గుర్తించాలి. అలా కాకుండా 90/60 కంటే తక్కువగా ఉంటే, అదీ తరచూ అలాగే ఉంటే లోబీపీ అని గుర్తించాలి. హై బీపీ వచ్చిన వారితో పోల్చుకుంటే లోబీపీ బాధితుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అసలు లోబీపీని ఎలా గుర్తించాలి. దాని లక్షణాలు ఏమిటి అంటే..

 లోబీపీ లక్షణాలు ఇవే

లోబీపీ లక్షణాలు ఇవే

ఇక లోబీపీ లక్షణాల విషయానికి వస్తే కూర్చుని పైకి లేచిన సమయంలో తల దిమ్ముగా ఉండటం, కళ్ళు మసకగా కనిపించటం, బాగా నీరసంగా అనిపించటం, త్వరగా అలసిపోవటం, ఎక్కువ సేపు పని చెయ్యలేకపోవటం, తేలికగా తలనొప్పి, వికారం వంటి లక్షణాలు, అప్పుడప్పుడు మూర్ఛ వంటి సమస్యలు ఉత్పన్నం అయితే ఇవే లోబీపీ లక్షణాలుగా చెప్తారు. ఇక లోబీపీ ఉన్న వారిలో రక్తం కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్తారు. పై లక్షణాలు ఉన్నా, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లోబీపీ మనం వాడే మందులతోనూ వచ్చే ఛాన్స్

లోబీపీ మనం వాడే మందులతోనూ వచ్చే ఛాన్స్

లో బీపీ అనేది చాలా సీరియస్ సమస్య. ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదని వైద్యులు చెప్తున్నారు. కొన్ని సందర్భాలలో హై బీపీ తగ్గించటం కోసం వేసుకునే మందులతో కూడా లో బీపీ సమస్య వస్తుంది. ఇతరత్రా రోగాలను తగ్గించటం కోసం ఉపయోగించే మందుల వల్ల కూడా లో బీపీ సమస్య ఉత్పన్నం అవుతుంది. బాడీ డీ హైడ్రేడ్ కావటం, మహిళల్లో రక్తస్రావం అధికంగా కావటం, సెప్టిసీమియా వంటి కారణాల వల్ల కూడా లోబీపీ సమస్య వస్తుంది. అడ్రినల్ హార్మోన్ సరైన మోతాదులో లేకపోవటం వల్ల కూడా లోబీపీ వస్తుంది .

లోబీపీ ఉంటే తస్మాత్ జాగ్రత్త ... నిర్లక్ష్యం తగదు

లోబీపీ ఉంటే తస్మాత్ జాగ్రత్త ... నిర్లక్ష్యం తగదు

అవయవాల నొప్పిలు, వాపులు కూడా లోబీపీ లక్షణాలుగా భావించవచ్చు. వేసో వ్యాగల్ రియాక్షన్ ల వల్ల, అలాగే మాదక ద్రవ్యాలను, అతిగా తీసుకోవటం, మద్యం సేవించటం వల్ల కూడా లోబీపీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక అనేక రుగ్మతలు, గుండె కొట్టుకోవటంలో వేగం తగ్గటం , గుండెలో రక్తం గడ్డ కట్టటం లాంటి వాటి వల్ల కూడా లోబీపీ సమస్య వస్తుంది. ఏది ఏమైనా లోబీపీ అంటే ఏముందిలే అని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యులను సంప్రదించాలి. తగిన వైద్యం తీసుకోవటంతో పాటు , జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Are you taking Low BP very easily? Doctors say it is deadly. If these Low BP symptoms occur, it is suggested to consult a doctor immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X