వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? చింతించకండి.. ఈ చిట్కాలు మీకోసమే!!

|
Google Oneindia TeluguNews

నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? నోటి దుర్వాసన కారణంగా పదిమందిలో మాట్లాడలేకపోతున్నారా? నోటి దుర్వాసనను తగ్గించుకోవడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదా? అయితే మీలాంటి వారికోసమే నోటి దుర్వాసన తగ్గించుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలను ఈరోజు తెలుసుకుందాం.

health tips: సరిగ్గా నిద్ర రావటంలేదా? మీ జీవనశైలి, ఈ పనులే కారణాలు కావొచ్చు!!health tips: సరిగ్గా నిద్ర రావటంలేదా? మీ జీవనశైలి, ఈ పనులే కారణాలు కావొచ్చు!!

నోటి దుర్వాసన తగ్గేందుకు ఎక్కువగా నీళ్ళు త్రాగండి

నోటి దుర్వాసన తగ్గేందుకు ఎక్కువగా నీళ్ళు త్రాగండి


నోటి దుర్వాసన సమస్య ఇప్పుడు సమాజంలోని చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. పదిమందిలో తిరిగేవారు నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత మేరకు నోటి దుర్వాసన నుండి బయటపడవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు త్రాగడం వల్ల కొంతమేర నోటి దుర్వాసన నుండి బయటపడవచ్చు. నోరు పొడిగా అనిపించినప్పుడు నీటిని తాగడం వల్ల, నోట్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. ఇక లాలాజలం మీ నోటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది.

వెచ్చని ఉప్పు నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించండి

వెచ్చని ఉప్పు నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించండి


వెచ్చని ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేయడం వల్ల కూడా నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. కొంచెం వేడి నీళ్లలో ఉప్పు వేసి నీటిని పుక్కిలించడం నోటి దుర్వాసనను తగ్గించే ఒక సహజమైన మార్గం. ఒక గ్లాసు వేడి నీటిలో పావు స్పూను ఉప్పు మిశ్రమాన్ని కలిపి 30సెకండ్ల పాటు నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మి వేస్తే కొంతమేర నోటి దుర్వాసన తగ్గుతుంది. దీనిని రోజువారీ అలవాటుగా చేసుకుంటే నోటి దుర్వాసన తగ్గించుకునే వీలుంటుంది

లవంగాలు బెస్ట్ రెమెడీ .. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ప్రయోజనకారి

లవంగాలు బెస్ట్ రెమెడీ .. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ప్రయోజనకారి


లవంగాలు మీ శ్వాసను తక్షణమే ఫ్రెష్ చేయడానికి మరియు కావిటీలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. రోజుకు మూడు నాలుగు సార్లు లవంగాలను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అలా అని లవంగాల నూనెను, లవంగాల పొడిని ఉపయోగించకూడదని సూచిస్తున్నారు. ఇక నోటి దుర్వాసనను తగ్గించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఒక గ్లాసు నీటిలో కొంచెం ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసుకుని, దాని నోట్లో పోసి పుక్కిలించి ఆపై ఉమ్మి వేస్తే కాస్త నోటి దుర్వాసన తగ్గుతుందని చెబుతున్నారు.

కూరగాయలు, పండ్లతోనూ ఉపయోగం

కూరగాయలు, పండ్లతోనూ ఉపయోగం


ఇక శ్వాసను తాజాగా ఉంచడం లో ఉపయోగపడే పండ్లను కూరగాయలను తీసుకోవాలని సూచిస్తున్నారు. యాపిల్స్, క్యారెట్లు సహజ టూత్ బ్రష్‌లుగా పనిచేస్తాయి. మీ దంతాల నుండి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. నారింజ (విటమిన్ సి) నోటి దుర్వాసనతో పోరాడటానికి లాలాజల ఉత్పత్తిని పెంచుతుంది.

 ఇంట్లోనే వస్తువులతో మౌత్ వాష్ తయారీ ఇలా

ఇంట్లోనే వస్తువులతో మౌత్ వాష్ తయారీ ఇలా


ఆల్కహాల్ లేని మౌత్ వాష్ ను మీ స్వంతంగా కూడా తయారు చేసుకుని వినియోగించవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. వంట గదిలో ఉండే పదార్థాలతోనే నోటి దుర్వాసనను తగ్గించుకునే మౌత్ వాష్ ను తయారు చేసుకో వచ్చు. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో, ఒక టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడి, రెండు నిమ్మకాయల రసం, వన్ అండ్ ఆఫ్ స్పూన్ తేనె, సగం టీ స్పూన్ బేకింగ్ సోడా అన్ని పదార్థాలను బాగా కలిపి ఒక కంటైనర్ లో పోసుకుంటే ఇది మౌత్ వాష్ గా ఉపయోగపడుతుంది. ఇది రెండు వారాల పాటు పాడవకుండా ఉంటుంది.

టీ ట్రీ ఆయిల్‌ తోనూ మంచి ఫలితం

టీ ట్రీ ఆయిల్‌ తోనూ మంచి ఫలితం


టీ ట్రీ ఆయిల్‌ని ఉపయోగించి మీ నోటి దుర్వాసనను తగ్గించుకునే మార్గాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బ్రష్ చేసుకునే సమయంలో టూత్ పేస్ట్ పై కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల కొంతమేర నోటి దుర్వాసన నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. ఇక గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి, దానితో మీ నోటిని శుభ్రం చేసుకుంటే కూడా ఫలితం ఉంటుందంటున్నారు. ఇక నాలుకను కూడా పూర్తిగా శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చూయింగ్ గమ్ నమలడం కూడా నోటి దుర్వాసన నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. ఇక ఇన్ని చేసినప్పటికీ నోటి దుర్వాసన తగ్గకుంటే దంత పరమైన సమస్యలకు దంత వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Troubled by bad breath? But doctors say that if you follow tips like drinking more water, gargling with salt in hot water, gargling with tea tree oil and apple cider vinegar, bad breath will be reduced
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X