హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భైంసా అల్లర్లు.. దోషులను ఉరికంభం ఎక్కించాలి.. కేటీఆర్ బాలీవుడ్ మత్తు వదలాలి.. : ఎంపీ అరవింద్

|
Google Oneindia TeluguNews

భైంసాలో చోటు చేసుకున్న అల్లర్లపై బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో స్పందించారు. భైంసాలో అల్లర్లు పక్కా ప్రణాళికతో జరుగుతున్నాయని ఆరోపించారు. ఇది బంగారు తెలంగాణా లేక మజ్లిస్ రాజ్యమా అని ప్రశ్నించారు. పరమత సహనం కేవలం హిందూ ధర్మంలోనే ఉంటుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. భైంసాలో అసలేం జరుగుతుందో నిఘా పెట్టాలని త్వరలోనే కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. గతేడాది భైంసాలో అల్లర్లు జరిగినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే... మళ్లీ ఈ పరిస్థితి పునరావృతమయ్యేది కాదన్నారు.

ఆ నలుగురే కారణం : ఎంపీ అరవింద్

ఆ నలుగురే కారణం : ఎంపీ అరవింద్


భైంసాలో అల్లర్లకు కాశిం బేగ్,జాబీర్ అహ్మద్,ఫైజలుల్లా అహ్మద్,మజీద్ అనే నలుగురు కారణమని ఎంపీ అరవింద్ ఆరోపించారు. వీరికి స్థానిక కలెక్టర్‌తో పాటు ఎంఐఎం పార్టీ మద్దతు ఉందని ఆరోపించారు. కాశిం బేగ్‌ను పోలీసులు 15 ఏళ్ల పాటు అక్కడినుంచి బహిష్కరించినా స్వేచ్చగా తిరుగుతున్నాడని అన్నారు. మజీద్ అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ రాజ్యమేలుతున్నాడని చెప్పారు. సర్వే నంబర్ 468,సర్వే నంబర్ 338లలో ఉన్న ప్రభుత్వ భూమిని అక్కడి ముస్లింలు కబ్జా చేశారని ఆరోపించారు. స్థానిక గట్టు మైసమ్మ కోనేరును పూడ్చేసి తెలంగాణయేతర ముస్లింలకు అక్కడ ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు.స్థానికంగా ఉన్న హిందూ స్మశానం గోడను కూడా కూల్చేసి... దాన్ని కూడా ముస్లింలే వాడుకుంటున్నారని అరవింద్ ఆరోపించారు.

కేటీఆర్ ఆ మత్తు నుంచి బయటకు రావాలి : అరవింద్

కేటీఆర్ ఆ మత్తు నుంచి బయటకు రావాలి : అరవింద్


భైంసాలో అల్లర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ హోంమంత్రి మహమూద్ అలీకి ట్వీట్ చేయడంపై అరవింద్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ బాలీవుడ్ మత్తులో నుంచి బయటకు రావాలని విమర్శించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువుల ప్రాణాలను టీఆర్ఎస్ పణంగా పెడుతోందన్నారు. భైంసాలో పరిస్థితులు అదుపులో ఉన్నాయని హోంమంత్రి ట్వీట్ చేశారని... దాని అర్థం ముస్లింలు సురక్షితంగా ఉన్నారన్న అర్థమని అరవింద్ వ్యాఖ్యానించారు. ముస్లింల బస్తీల్లో పోలీసుల బందోబస్తు పెట్టి రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు.

ఆ రిపోర్టర్‌ను బీజేపీ కార్యకర్తలే ఆస్పత్రిలో చేర్చారు...

ఆ రిపోర్టర్‌ను బీజేపీ కార్యకర్తలే ఆస్పత్రిలో చేర్చారు...

అల్లర్ల సమయంలో విజయ్ అనే రిపోర్టర్‌ కత్తిపోట్లకు గురైతే అతన్ని పట్టించుకున్నవారే లేరన్నారు. బీజేపీ కార్యకర్తలే ఆయన్ను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారని చెప్పారు. నిజామాబాద్ ఆస్పత్రిలో కనీసం నర్సు,డాక్టర్ కూడా లేరని... ప్రథమ చికిత్స చేసే సదుపాయం కూడా అక్కడ లేకుండా పోయిందని అన్నారు. దాంతో మెరుగైన వైద్యం కోసం బీజేపీ కార్యకర్తలే విజయ్‌ను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. కనీసం యశోద ఆస్పత్రికి వెళ్లి అతన్ని పరామర్శించే తీరిక కూడా కేటీఆర్‌కు లేదన్నారు. తాను భైంసాకు బయలుదేరితే... ఇంటలిజెన్స్ రిపోర్టుతో మార్గమధ్యలోనే అడ్డుకున్న పోలీసులకు భైంసాలో అల్లర్లకు సంబంధించిన ఇంటలిజెన్స్ రిపోర్టు మాత్రం ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు.

దోషులను ఉరికంభం ఎక్కించాలి : అరవింద్

దోషులను ఉరికంభం ఎక్కించాలి : అరవింద్

గతేడాది భైంసాలో అల్లర్లు జరిగినప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే... ఈరోజు ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదన్నారు. కనీసం ఇప్పుడైనా సిట్టింగ్ జడ్జితో అల్లర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని... అవసరమైతే దోషులను ఉరికంభం ఎక్కించాలని... అప్పుడే భైంసాలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని అన్నారు. గతంలో అల్లర్ల కారణంగా నష్టపోయిన హిందూ కుటుంబాలను టీఆర్ఎస్ నాయకులు కనీసం పరామర్శించలేదన్నారు. ఎంఐఎం పార్టీ అక్కడి ముస్లింలకు పరిహారం కూడా ఇచ్చిందని... కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం హిందువులను పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో హిందూ-ముస్లిం మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వమే గ్యాప్ పెంచుతోందని విమర్శించారు.

English summary
BJP MP Arvind reacted strongly to the riots in Bhainsa. He alleged that the riots in Bhainsa were planned. He was questioned whether it was the Bangaru Telangana or the Majlis Telangana.He said he would soon write to the Center to keep an eye on what was actually going on in Bhainsa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X