Samantha-Preetham Jukalker:మా బంధం ఏంటో చైతుకు కూడా తెలుసు, ప్రీతమ్
నాగ చైతన్య - సమంతల విడాకుల వ్యవహారానికి సంబంధించిన వార్తలే గుప్పుమంటున్నాయి. భార్యభర్తలుగా విడిపోయినా కానీ తమ మధ్య స్నేహ బంధం కొనసాగుతుందని చై-సామ్ చెప్పినా కానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఆగట్లేదు. వాళ్లిద్దరూ విడిపోవడానికి సమంత పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ కారణం అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ కూడా వివరణ ఇచ్చింది.

ఐలవ్‌యూ ఎలా చెబుతా..?
రీసెంట్‌గా ఈ విషయం గురించి ప్రీతమ్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. సమంతను జీజీ (చెల్లి) అని పిలుస్తానని చాలా మందికి తెలుసు.. అలాంటిది ఆమెకి ఐలవ్ యూ ఎలా చెప్తాను?.. మా మధ్య ఉన్నది ఎలాంటి రిలేషన్ అనేది నాగ చైతన్యకు కూడా తెలుసు.. నేను సామ్ కెరీర్ నాశనం చేశానంటూ బ్లేమ్ చేస్తున్నారు. దీని గురించి నాగ చైతన్య అఫీషియల్‌గా ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. ఎవరెన్ని అనుకున్నా సమంతకు అన్నివేళలా నేను తోడుగా ఉంటాను అని ప్రీతమ్ అన్నాడు.

పిల్లలను కనేందుకు ఓకే
మరొవైపు నీలిమ గుణ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. పిల్లల్ని కనేందుకు వీలుగా శాకుంతలం సినిమాను చేయకూడదని సమంత భావించిందని తెలిపారు. శాకుంతలం కథ విన్న తర్వాత కొన్ని షరతులతో సినిమా చేసేందుకు ఓకే చెప్పిందని వివరించారు "జులై, ఆగస్టు నాటికి సినిమా పూర్తి చేయాలని గుణశేఖర్‌ను కోరారని వివరించారు. శాకుంతలం సినిమా తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని పిల్లల్ని కనాలన్నది సమంత ఆలోచన అని పేర్కొన్నారు. తల్లి కావాలనే బలమైన కోరిక సామ్‌లో కనిపించిందని తెలిపారు. తన ఆలోచనలను మేం గౌరవించి, అందుకు అనుగుణంగానే శాకుంతలం చిత్రం షెడ్యూల్ రూపొందించాం అని వెల్లడించారు. అంతలోనే ఏదో జరిగిందని.. నాగచైతన్య, సమంత విడిపోయారని వివరించారు. ఈ పరిణామం ఊహించలేదని పేర్కొన్నారు.

బాధాకరం..
విడాకులు అనేది ఒకరి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని సమంత తెలిపింది. ఈ బాధను ఒంటరిగా అనుభవించేందుకు తనకు సమయం, అవకాశం ఇవ్వాలని కోరింది. ఇలాంటి తప్పుడు కథనాలతో తనపై కనికరం లేకుండా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఎఫైర్లు, అబార్షన్లంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాటిని తాను ఎన్నటికీ అంగీకరించేది లేదని.. ప్రామిస్ చేస్తున్నానని వివరించారు. ప్రచారంలో ఉన్నవన్నీ కట్టుకథలేనని సమంత వివరణ ఇచ్చారు.
Recommended Video

పుకార్లు షికార్లు
నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. వారి మధ్య ఉన్నది అక్కాతమ్ముళ్ల రిలేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే ప్రీతమ్ కామెంట్ చేశారు. నాగ చైతన్యే స్పందించాలని కోరారు.












Click it and Unblock the Notifications