హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sai Dharam Tej: సాయికి కౌన్సెలింగ్ ఇద్దామనుకున్నా-మా ఇంటి నుంచే వెళ్లాడు: నరేష్,గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి...

|
Google Oneindia TeluguNews

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘటనపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. సాయి తన బిడ్డ లాంటి వాడని... త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ప్రమాదానికి ముందు సాయి తమ ఇంటి నుంచే బయలుదేరాడని చెప్పారు. తన కొడుకు నవీన్,సాయి ధరమ్ తేజ్‌లు క్లోజ్ ఫ్రెండ్స్ అని... బైక్ రైడింగ్ విషయంలో ఈ ఇద్దరికీ తాను కౌన్సెలింగ్ ఇవ్వాలనుకున్నానని పేర్కొన్నారు. కానీ ఇంతలోనే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Oneindia Telugu

నాలుగైదు రోజుల క్రితం కౌన్సెలింగ్ ఇద్దామనుకున్నా : నరేష్

'బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ నా బిడ్డ లాంటివాడు. త్వరగా కోలుకుని వెంటనే షూటింగ్స్‌కి వెళ్లాలని భగవంతుడిని,మా అమ్మను ప్రార్థిస్తున్నాను. సాయి,మా అబ్బాయి నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్.బ్రదర్స్ లాగా ఉంటారు.సాయంత్రం ఇక్కడి నుంచే బయలుదేరారు.నాలుగైదు రోజుల క్రితం వీరికి కౌన్సెలింగ్ ఇద్దామనుకున్నాను.ఎందుకంటున్నానంటే.. ఇది మంచి వయసు... పెళ్లి చేసుకుని కెరీర్‌లో సెటిల్ కావాల్సిన వయసు. ఈ టైమ్‌లో ఇలాంటి రిస్కులు తీసుకోకుండా ఉంటే మంచిది.నేను కూడా ఇంతకుముందు బైక్ ప్రమాదానికి గురైనప్పుడు మా అమ్మ నాతో ఒట్టేయించి బైక్ రైడింగ్ మానిపించింది. అప్పటినుంచి బైక్స్ ముట్టడం లేదు. గతంలో కోట శ్రీనివాసరావు,బాబూ మోహన్,కోమటిరెడ్డి... వాళ్ల అబ్బాయిలు రోడ్డు ప్రమాదానికి గురై కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తారు. రానున్న రోజుల్లో బైక్స్ ముట్టుకోవద్దని నా ప్రార్థన. సాయి కచ్చితంగా కోలుకుని షూటింగ్స్‌కి వెళ్తాడు. ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను.' అని నరేష్ పేర్కొన్నారు. అంతకుముందు,మరో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... సాయి ధరమ్ తేజ్‌కి కేవలం కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని... ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి... ఔటాఫ్ డేంజ్...

గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి... ఔటాఫ్ డేంజ్...

సాయి ధరమ్ తేజ్‌ను సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మెడికవర్‌లో సాయి ధరమ్ తేజ్‌కి చికిత్స అందించిన డా.సతీశ్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం(సెప్టెంబర్ 10) రాత్రి 7.45గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరగ్గా... మొదటి గంటలోనే అతన్ని ఆస్పత్రికి తరలించారని చెప్పారు. పోలీసులు,108 సిబ్బంది సకాలంలో ఆస్పత్రికి తరలించగలిగారని తెలిపారు. ప్రమాదం తర్వాత మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారని... ఆ సమయంలో అందించే చికిత్స చాలా కీలకమని సతీష్ చెప్పారు. గోల్డెన్ అవర్‌లో చికిత్స అందితేనే పేషెంట్ త్వరగా కోలుకోవడానికి,ప్రాణాపాయం నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. సాయి ధరమ్ తేజ్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని... మొదట అతని శరీరం చికిత్సకు స్పందించలేదని అన్నారు. దీంతో కృత్రిమ శ్వాస అందించి చికిత్స అందించినట్లు తెలిపారు.

ఆ సమయంలో తేజుకు ఫిట్స్

ఆ సమయంలో తేజుకు ఫిట్స్

సాయి ధరమ్ తేజ్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు అతని కాన్సియస్ లెవల్ 7/15 ఉందని... సాధారణంగా ఇది 15/15 ఉండాలని డా.సతీష్ తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండటంతో కృత్రిమ శ్వాస అందించాల్సి వచ్చిందన్నారు. అదృష్టవశాత్తు సీటీ స్కాన్,బ్రెయిన్ స్కాన్,పొత్తి కడుపు స్కాన్ రిపోర్టుల్లో నార్మల్ వచ్చిందన్నారు.మెదడుకు దెబ్బలేమీ తగల్లేదని,అంతర్గతంగా బ్లీడింగ్ కూడా ఏమీ లేదని చెప్పారు. అయితే ఆస్పత్రికి తరలించే సమయంలో తేజుకు ఫిట్స్ వచ్చాయన్నారు. దీంతో మళ్లీ ఫిట్స్ రాకుండా మెడిసిన్ అందించామన్నారు. ఆరోగ్యం నిలకడ స్థితిలోకి వచ్చాక... ఇక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ మెడికల్ హిస్టరీలో ఫిట్స్ లేవన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మెదడు భాగంలో గాయాలవలేదన్నారు. కాలర్ బోన్ మాత్రమే ఫ్రాక్చర్ అయిందని... దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఓవర్ స్పీడే కారణం...

ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశంలో అక్కడక్కడా ఇసుక ఉండటం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చునని అంటున్నారు. పక్కనే కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న సైట్ నుంచి ఇసుక వాహనాలు తిరుగుతుండటంతో... రోడ్డుపై ఇసుక పడి ఉంటుందని చెబుతున్నారు. ప్రమాద సమయంలో రోడ్డు రద్దీగా లేకపోవడంతో సాయి ధరమ్ తేజ్‌కు పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు. నిన్న వినాయక చవితి కావడంతో రోడ్డు ఖాళీగా ఉంది. ఒకవేళ అదే సమయంలో వెనుక నుంచి వేరే వాహనం వచ్చి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో సాయి ధరమ్ తేజ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ ఆస్పత్రిలో ఉండి చూసుకుంటున్నారు.

ఆ బైక్ ఖరీదు ఎంతంటే....

ఆ బైక్ ఖరీదు ఎంతంటే....

సాయి ధరమ్ తేజ్ ట్రంఫ్ బైక్ నెంబర్ TS07 GJ1258. సూపర్ బైక్‌గా పిలిచే దీని ఖరీదు దాదాపు రూ.18లక్షలు. అనిల్ కుమార్ పేరుతో ఆ బైక్ రిజిస్ట్రేషన్ అయింది. ఇది హై ఎండ్ బైక్ అని చెబుతారు. దీని బ‌రువు 228 కేజీల వ‌ర‌కు ఉంటుంది.బైక్ రైడింగ్ అంటే తేజ్‌కి చాలా ఇష్టం. షూటింగ్ లేని సమయంలో తన బైక్ లేదా స్నేహితుల బైక్ తీసుకుని సరదాగా రైడింగ్‌కు వెళ్తుంటాడు. శుక్ర‌వారం కూడా అలాగే బయటకు వెళ్లగా ప్రమాదానికి గురయ్యాడు. ప్ర‌మాదం స‌మయంలో అత‌ను హెల్మెట్ ధ‌రించ‌డం వ‌ల‌న పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.

సాయి ధరమ్ తేజ్‌పై కేసు నమోదు

సాయి ధరమ్ తేజ్‌పై కేసు నమోదు


ప్రమాద ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద ఐపీసీ 336, 184 ఎంవీ యాక్ట్ కింద సాయి ధరమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 8:05 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ను (ట్రంప్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం గురించి పోలీసులకు 108 సిబ్బంది తెలియజేశారు.

English summary
Senior actor Naresh reacted on the incident where mega hero Sai Dharam Tej was injured in a road accident. Sai is just like my child ... am praying to God to his quick recovery. Before accident he started from my house only,Naresh added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X