హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ బయోటెక్ నాసికా వ్యాక్సిన్ ధరలు ఇవే: ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో తేడా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసికా టీకా(నాజల్ వ్యాక్సిన్)‌‌ను 18 ఏళ్లు పైబడినవారికి బూస్టర్ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ టీకా ధరను భారత్ బయోటెక్ తాజాగా ప్రకటించింది.

భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ధరలు ఇలా

భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ధరలు ఇలా

భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ (ఇన్‌కోవాక్) జనవరి నాల్గవ వారం నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో రూ. 325, ప్రైవేట్ ఆసుపత్రులలో రూ. 800 ధరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ CoWin యాప్‌లో జాబితా చేయడం జరుగుతుంది. డిసెంబర్ నెల ప్రారంభంలో, భారత్ బయోటెక్ iNCOVACC హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌ల ఉపయోగం కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి ఆమోదం పొందింది. భారతదేశం అంతటా 9 ట్రయల్ సైట్‌లలో 875 మంది రోగులలో బూస్టర్ డోస్ అధ్యయనాలు నిర్వహించిన తర్వాత జాతీయ ఔషధ నియంత్రణ నుంచి ఆమోదం లభించింది.

బూస్టర్ డోసుగా భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్

బూస్టర్ డోసుగా భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్

హెటెరోలాగస్ బూస్టర్ అంటే ఒక వ్యక్తికి అతను/ఆమె ప్రాథమిక మోతాదుగా స్వీకరించిన టీకా నుంచి మూడవ వ్యాక్సిన్‌ని మరొక టీకా వేయవచ్చు.

కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకొవాక్ నాసికా టీకాను బూస్టర్ డోసుగా పొందవచ్చన్నమాట. iNCOVACC గ్రహీతలు గణనీయమైన స్థాయిలో మ్యూకోసల్ IgA యాంటీబాడీ స్థాయిలను ప్రదర్శించారు(లాలాజలంలో కొలుస్తారు). ఎగువ శ్వాసకోశంలో ఉండే మ్యూకోసల్ IgA యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్లు, ప్రసారాన్ని తగ్గించడంలో ప్రయోజనాలను అందించగలవని తెలిపింది.

ముక్కు ద్వారా వేసే మొట్టమొదటి ప్రాథమిక టీకా ఇదే

ముక్కు ద్వారా వేసే మొట్టమొదటి ప్రాథమిక టీకా ఇదే

ప్రస్తుతానికి ప్రవేట్ ఆస్పత్రుల్లోనే ముక్కు ద్వారా తీసుకునే ఈ టీకా అందుబాటులో ఉంటుంది. జాతీయ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీబీవీ154గా పిలిచే ఈ నాసికా టీకా ఇంకొవాక్ బ్రాండ్పేరుతో మార్కెట్లోకి వచ్చింది. కరోనా వైరస్ పై పోరులో ఈ వ్యాక్సిన్ చాలా సమర్థవంతంా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షల్లో తేలిందని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. ప్రపంచంలో రెండు డోసుల్లో ముక్కు ద్వారా తీసుకునే మొట్టమొదటి ప్రాథమిక టీకా కూడా ఇదేనని భారత్ బయోటక్ స్పష్టం చేసింది. కాగా,

ఇంజెక్షన్‌లతో పోల్చినప్పుడు నాసికా వ్యాక్సిన్‌లు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వైరస్ ఎంట్రీ పాయింట్లను రక్షించడంతో పాటు, నాసికా టీకాలు నిల్వ చేయడం సులభం. అంతేగాక, తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. పంపిణీ చేయడం కూడా సులభమేనని తెలిపింది.

English summary
Bharat Biotech's nasal Covid Vaccine Priced At Rs 325 In Govt Hospitals, Rs 800 In Private Hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X