వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న‌రేంద్ర‌మోడీ భ‌య‌ప‌డ్డారుగా..!! టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతోందా?? అందులో నోడౌట్??

|
Google Oneindia TeluguNews

న‌రేంద్ర‌మోడీ.. విశాల‌మైన మ‌న‌సుతోపాటు విశాల‌మైన ఛాతీ క‌లిగిన వ్య‌క్తిగా భార‌తీయ జ‌న‌తాపార్టీ అభివ‌ర్ణించింది. కుయుక్తుల‌కు ఆల‌వాల‌మైన ప్ర‌శాంత్ కిషోర్ లాంటి వ్య‌క్తి గుజ‌రాత్ వెలిగిపోతోందంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌ప‌రిచే ప్ర‌చారం చేయ‌డంతో చాయ్‌వాలా ప్ర‌ధాన‌మంత్రి అయ్యాడంటూ త‌న‌కు తానే డ‌ప్పు కొట్టుకున్న వ్య‌క్తి. ప్ర‌ధాన‌మంత్రి అయిన త‌ర్వాత ఏమైంది... రాజ్యాంగ బ‌ద్ధంగా ఏర్ప‌డ్డ సంస్థ‌ల‌ను గుప్పిట‌ప‌ట్టి దేశాన్ని పిడికిలిలో ఇముడ్చుకున్నారు. ప్ర‌జాస్వామ్యంలో నియంత‌గా చెలామ‌ణి అవుతున్న అటువంటి వ్య‌క్తి మొద‌టిసారి భ‌య‌ప‌డ్డారు.

పార్టీని చీల్చారుకానీ.. ప్ర‌జ‌ల‌ను చీల్చ‌లేక‌పోయారు?

పార్టీని చీల్చారుకానీ.. ప్ర‌జ‌ల‌ను చీల్చ‌లేక‌పోయారు?


అవును న‌రేంద్ర‌మోడీ, ఆయ‌న స‌హ‌చ‌రుడు అమిత్ షా భ‌య‌ప‌డ్డారు. ఇది కాద‌న‌లేని వాస్త‌వం. దేవేంద్ర ఫ‌డ్న‌విస్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌కుండా చివ‌రి నిముషంలో ఏక్‌నాథ్ షిండేకే ఆ ప‌ద‌వి వ‌దిలిపెట్టేశారు. ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను తీసుకొచ్చి స్టార్ హోట‌ల్ లో పెట్టి శివ‌సేన‌ను చీల్చ‌గ‌లిగామ‌నుకున్నారుకానీ శివ‌సేన వైపునుంచి ప్ర‌జ‌ల‌ను చీల్చ‌లేక‌పోయారు. ప్ర‌జ‌ల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేల‌తోపాటు బీజేపీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోందంటూ ఇంటిలిజెన్స్ ఇచ్చిన నివేదిక‌తో వెన‌క‌డుగు వేశారు. ఇక్క‌డ కూడా త‌మ భ‌యాన్ని క‌ప్పిపుచ్చుకొని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని చూశారు.

 వారిమానాన వారిని వ‌దిలేశారు!!

వారిమానాన వారిని వ‌దిలేశారు!!

ఇంత‌వ‌ర‌కు తీసుకొచ్చిన ఏక్ నాథ్ షిండే వ‌ర్గాన్ని వారి మానాన వారిని వ‌దిలేశారు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తే వారికే వ‌స్తుందికానీ బీజేపీ రాద‌నే నిశ్చ‌యానికి బీజేపీ పెద్ద‌లు వ‌చ్చారు. ఏ రాష్ట్రంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం ఏర్ప‌డితే ఆ ప్ర‌భుత్వాన్ని నిద్ర‌పోనీయ‌కుండా సీబీఐని, ఐటీని, ఈడీని ఉసిగొల్పి, ఎమ్మెల్యేల‌ను చీల్చి బీజేపీ ప్ర‌భుత్వాల‌ను ఏర్ప‌రుస్తూ బ‌య‌ట ప్ర‌పంచ దేశాల్లో మాత్రం భార‌త‌దేశ ప్ర‌జాస్వామ్యం గురించి గొప్ప‌గా ప్ర‌సంగించ‌డ‌మే మోడీలో ఉన్న అద్భుత నైపుణ్యం. ఆ నైపుణ్యానికి అమిత్ షా లాంటివారు గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు కొడుతుంటారు.

 ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌టంతో..

ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌టంతో..


ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ పేరుతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను కూల్చిన బీజేపీ చివ‌రి నిముషంలో మ‌హారాష్ట్ర‌లో వెన‌క‌డుగు వేసింది. ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వితో స‌రిపెట్టుకుంది. ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌య్యే వ్య‌తిరేక‌త నుంచి త‌ప్పించుకోవ‌డానికి వేసిన రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గా విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. శివ‌సేన‌కు చీలిక‌లు కొత్త‌కాదు. అయినా ఆ పార్టీ త‌ట్టుకొని నిల‌బ‌డింది. ఇది కూడా బీజేపీ నేత‌ల‌ను ఆలోచింప‌చేసింది. ఎన్నిక‌ల‌కు రెండు సంవ‌త్స‌రాలే స‌మ‌యం ఉండ‌టంతో ప్ర‌స్తుతం దూకుడుగా వెళ్ల‌డంక‌న్నా ఓర్పుగా ఉండ‌ట‌మే మేల‌న్న అభిప్రాయానికి రావ‌డంతోనే చివ‌రి నిముషంలో మ‌హారాష్ట్ర రాజ‌కీయంలో మార్పు చోటుచేసుకుంది.

English summary
The BJP leaders were afraid of opposition from the people of Maharashtra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X