వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాచల్ ప్రదేశ్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. బీజేపీపై వ్యతిరేకత వచ్చిందా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 29 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్‌సభ స్థానాల ఉపఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. కొన్ని చోట్ల బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలగా.. కాంగ్రెస్ పార్టీకి కొన్ని విజయాలు కొత్త జోష్ నింపాయి. హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, పశ్చిమెంగాల్ రాష్ట్రాలో బీజేపీ ఎదురుదెబ్బలు తగిలాయి.

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. మండీ లోక్‌సభ నియోజకవరగ్ంలో బీజేపీ ఎంీప రామ్ స్వరూప్ శర్మ మరణించడంతో ఇక్కడ ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరపున మాజీ సీఎం దివంగత వీరబధ్రసింగ్ సతీమణి ప్రతిభా సింగ్ పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ నుంచి పోటీ చేసిన కార్గిల్ వీరుడు బ్రిడేడియర్ కుషాల్ సింగ్ ఓటమి పాలయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సొంత జిల్లా మండీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అర్కీ, ఫతేపూర్, జుట్టమ్ కొట్కాయ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది.

 Bypolls: For BJP, Setbacks In Himachal Pradesh, Haryana, West Bengal

హర్యానాలోని ఎల్లెనాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మళ్లీ అభయ్ సింగ్ చౌతాలా వశమైంది. గతంలో ఈ ప్రాంతం నుంచి విజయం సాధించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ) సెక్రటరీ జనరల్ అభయ్ సింగ్ చౌతాలా.. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో జరిగిన ఉపఎన్నికల్లో మళ్లీ చౌతాలనే విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ-జేజేపీ అభ్యర్థి గోవింద్ కందాపై 8వేల మెజార్టీతో గెలిచారు. మరోవైపు, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీ లోక్‌సభ స్థానం నుంచి శివసేన అభ్యర్థి కళాబెన్ డేల్కర్ విజయం సాధించారు.

Recommended Video

నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తేవాలి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దిన్హాటా, గోసాబా, శాంతిపూర్, ఖర్దాహ్ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. బీజేపీ కంచుకోటగా చెప్పుకునే దిన్హాటోలో కూడా టీఎంసీ లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచింది. కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగ్గా.. సిండ్గీ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించగా.. హంగల్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది బీజేపీ సిట్టింద్ స్థానం కావడం గమనార్హం.

ఇది ఇలావుంటే, ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మాత్రం బీజేపీ హవా కొనసాగింది. ఈ రాష్ట్రంలో జరిగిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా లోక్‌సభ నియోజకవర్గంపాటు రెండు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచింది.

English summary
Bypolls: For BJP, Setbacks In Himachal Pradesh, Haryana, West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X