వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారులకు కోవోవ్యాక్స్ రెడీ, మోడీ వల్లే రూపొందించగలిగం: ఆదర్ పూనావాలా

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదు. చైనా, అమెరికాలో కేసులు ఉన్నా.. ఇండియాలో ఇప్పటివరకు అయితే ఓకే.. అందుకు కారణం అందరూ టీకా తీసుకోవడమే. దాదాపు అందరూ రెండు డోసులు.. కొందరు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. క్రమ క్రమంగా పిల్లలకు కూడా టీకా వేస్తున్నారు. దానికి సంబంధించి నిర్దేశిత సమయంలో వయస్సును నిర్ణయించి మరీ వేస్తున్నారు.

దేశంలో గల చిన్నారుల కోసం కోవోవాక్స్ వాక్సిన్ సిద్ధంగా ఉందని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. సీరం సంస్థ కోవిడ్ కోసం రూపొందించిన రెండో వ్యాక్సిన్ ఇది. పెద్దవారి కోసం ఇంతకుముందు 'కోవీషీల్డ్' రూపొందించిన సంగతి తెలిసిందే. చిన్నారుల కోసం కోవోవాక్స్ తయారు చేసింది. ఇది 12-17 ఏళ్లలోపు పిల్లలపై పనిచేస్తుంది.

Covovax now available for children: Adar Poonawalla

దేశవ్యాప్తంగా పిల్లల కోసం వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. డ్రైవ్‌లో భాగంగా కోవోవాక్స్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ భారత దేశంతోపాటు యూరప్‌లో వినియోగిస్తున్నామని అదర్ పూనావాలా వెల్లడించారు. వ్యాక్సిన్ 90 శాతం సమర్ధంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ చొరవ వల్ల ఈ వ్యాక్సిన్ తయారీ సాధ్యమైందని పూనావాలా చెప్పారు. దేశంలోని చిన్నారులకు కోవిడ్ నుంచి రక్షణకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

గతేడాది కరోనా కేసుల వల్ల జనాలు పిట్టల్లా రాలిపోయారు. సెకండ్ వేవ్ ప్రభావం దేశంలో ఎక్కువగా ఉండేది. తర్వాత ఫంగస్ కూడా వచ్చాయి. ఈ సారి థర్డ్ వేవ్ వచ్చింది కానీ.. ఊసురు మనిపించంది. అంటే అంతగా ప్రభావం లేదు. ఫోర్త్ వేవ్ జూన్ నుంచి అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సో జాగ్రత్తగా ఉండటమే మేలు. కరోనా మహమ్మారిని టీకాలే కాపాడుతున్నాయి.

English summary
Serum Institute of India's coronavirus vaccine Covovax is now available for children across the country, company CEO Adar Poonawalla said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X