అది ఓ కన్నీటి సముద్రం... రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం ఓ ‘అనాలోచిత నిర్ణయమనీ’... ‘విషాదం’ అనే మాటకు ఏమాత్రం తక్కువ కాదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: పెద్దనోట్లు రద్దు చేసి ఏడాది అయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రధాని తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం ఓ 'అనాలోచిత నిర్ణయమనీ'... 'విషాదం' అనే మాటకు ఏమాత్రం తక్కువ కాదని ఆయన వ్యాఖ్యానించారు.

బుధవారం ట్విటర్ వేదికగా రాహుల్ స్పందిస్తూ... 'నోట్ల రద్దు ఓ విషాదం. ప్రధాని తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా జీవితాలు, జీవనోపాధి కోల్పోయిన కోట్లాది మంది నిజాయితీపరులైన భారతీయులకు మేము అండగా ఉంటాం...' అని వ్యాఖ్యానించారు.

Demonetisation A 'Tragedy', 'Thoughtless Act' Of PM says Rahul Gandhi

ఈ సందర్భంగా రాహుల్ ఓ హిందీ పద్యాన్ని కూడా ఉటంకించారు. 'ఒక్క కన్నీటి బొట్టు కూడా ప్రభుత్వానికి ప్రమాదకరమే. అయితే మీరు ఇంతటి కన్నీటి సముద్రాన్ని చూసి ఉండరు...' అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనికి ఆయన జతచేసిన ఓ వృద్ధుడి ఫోటో కంటతడి పెట్టించేలా ఉంది.

డబ్బు చేతికి అందక ఏటీఎం ముందు నిలబడి ఆ వృద్ధుడి విలపిస్తున్న దృశ్యం నెటిజన్లను కదిలిస్తోంది. రాహుల్ పోస్టు చేసిన నాలుగు గంటల్లోనే 5 వేల మంది దీన్ని రీట్వీట్ చేయగా... 10 వేలమంది నెటిజన్లు లైక్ చేశారు. రెండు వేలమందికి పైగా స్పందిస్తూ కామెంట్లు రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+