భారత వ్యూహాలు.. దొంగలపాలు! సెల్‌ఫోన్ తస్కరణతో...
న్యూఢిల్లీ: మన దేశానికి చెందిన కొన్ని వ్యూహాలు దొంగలపాలయ్యాయి. దీనికి కారణం.. ఓ మొబైల్ ఫోన్. ఆ మొబైల్ ఫోన్‌లో భారత్‌కు చెందిన కీలక సమాచారం ఉంది. ఇంతకీ వారు మామూలు ఫోన్ దొంగలేనా? ఆ ఫోన్ కనుక శత్రుదేశాల చేతికి చిక్కితే భారత్ పరిస్థితేంటి?
అసలేం జరిగిందంటే...ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి బృందంలో దౌత్యాధికారిణి ఈనామ్ గంభీర్ మొబైల్‌ను దొంగలు బలవంతంగా లాక్కుపోయారు. ఆ ఫోన్‌లో అత్యంత కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.

శనివారం సాయం త్రం వేళ ఈనామ్ తన తల్లితో కలిసి ఢిల్లీలోన రోహిణి ప్రాంతంలో వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి హనుమాన్ మందిర్ ఎక్కడ ఉందని ఆమెను అడిగారు. ఆమె చేయెత్తి దారి చూపుతుండగా వారు ఆమె చేతిలోని ఖరీదైన మొబైల్‌ను లాక్కొని అక్కణ్ణుంచి నిష్క్రమించారు.
సాయంత్రం.. చీకట్లు కమ్ముకుంటున్న వేళ కావడంతో కనీసం తాను ఆ బైక్ నంబరు కూడా గుర్తించలేకపోయానని ఈనామ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఫోన్‌లో భారత వ్యూహాలకు సంబంధించిన కొంత కీలక సమాచారం ఉన్నట్లు ఈనామ్ చెప్పడంతో పోలీసులు ఆ మొబైల్ దొంగల కోసం తమ వేటను ముమ్మరం చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications