వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెనారస్ వర్సిటీ గొడవ: 1000 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్

బెనారస్ వర్సిటీలో జరిగిన గొడవపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. వారణాసికి చెందిన ముగ్గురు అదనపు కలెక్టర్లు సహా ఇద్దరు పోలీస్‌ అధికారులపై వేటు వేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లక్నో: బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. వారణాసికి చెందిన ముగ్గురు అదనపు కలెక్టర్లు సహా ఇద్దరు పోలీస్‌ అధికారులపై వేటు వేసింది.

లాఠీచార్జికి సంబంధించి గుర్తుతెలియని పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అధికారులు, వర్సిటీలో హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలతో దాదాపు 1,000 మంది విద్యార్థులపై కేసు నమోదు చేశారు.

FIR filed against 1,000 protesting students for arson, other charges

లాఠీచార్జి వివాదాస్పదం కావడంతో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని వారిరువురు ఆదిత్యనాథ్‌కు సూచించారు. ఈ లాఠీచార్జిని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని సీఎం పోలీసులను ఆదేశించారు.

యూపీ గవర్నర్‌ రామ్‌నాయక్‌ మాట్లాడుతూ, ఈ ఘటనపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశామనీ, నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

English summary
The Senior Superintendent of Police (SSP) office in Varanasi today confirmed that FIRs have been filed against 1,000 Banaras Hindu University (BHU) students in Lanka police station here for arson and other charges, according to the news agency ANI. Also, Station House Officer (SHO) of Lanka area, Circle Officer (CO) of Bhelupur and one Additional City Magistrate (ACM) were removed today after being held prima facie responsible for imposing lathicharge at the university. The Uttar Pradesh Police on Saturday lathi-charged the BHU students, who were protesting since three days against alleged molestation of a University girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X