వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ -19 లక్షణాలున్న వ్యక్తులకు చికిత్స అందించేందుకు ప్రైవేట్ సంస్థలకు సూచనలు చేసిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. కరోనావైరస్ లక్షణాలు ఒక వ్యక్తిలో కనిపించినా.. అనుమానం వచ్చినా వెంటనే ఆ వ్యక్తిని చికిత్స కోసం ఐసొలేషన్ వార్డుకు తరలించాలి. ఆ వ్యక్తి ఎవరెవరితో టచ్‌లోకి వచ్చాడో ఎవరెవరిని కలిశాడో ముందుగా గుర్తించే ప్రయత్నం చేయాలి. ఇలా గుర్తించి ఎక్కడికక్కడే కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలి. ఈ క్రమంలోనే ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే అన్ని ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్స్‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్స్‌తో పాటు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నవారు ఆయుష్‌లో ప్రాక్టీస్ చేస్తున్నవారు కూడా ఎవరైన కోవిడ్ 19 అనుమానితులను గుర్తిస్తే వెంటనే ఆ జిల్లా సర్వేలియన్స్ యూనిట్‌కు తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారిపై గట్టి నిఘా వేసి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గత 14 రోజులుగా కరోనావైరస్ లక్షణాలు ఉన్నట్లు కనుక తమ దృష్టికి వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఐసొలేషన్ వార్డుకు తరలించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రొటోకాల్ ప్రకారం ఆ వ్యక్తికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

Guidelines for notifying COVID-19 affected persons by Private Institutions

ఇక కరోనావైరస్ అనుమానితుడి సమాచారమంతా స్టేట్ హెల్ప్ లైన్‌ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని కోరింది. లేదా నేషనల్ హెల్ప్‌లైన్ నెంబర్ 1075కు ఫోన్ చేసి చెప్పాలని లేదా [email protected]కు ఈమెయిల్ చేయాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల హెల్ప్ లైన్ నెంబర్లు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్: 08662410978
తెలంగాణ: 104

Recommended Video

కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu

ఒక వ్యక్తి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే అది కరోనావైరస్ లక్షణాలుగా గుర్తించాలి. దగ్గు, జలుబు ఉన్నా అవి కరోనావైరస్ లక్షణాలుగా గుర్తించాలి. అంతేకాదు కరోనావైరస్ వ్యాప్తి చెందిన దేశాల నుంచి భారత్‌కు చేరుకున్న వారిని స్క్రీనింగ్ చేయాలని సూచించింది.

English summary
Health ministry gives directions or guidelines for notifying covid-19afeected persoons by private institutions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X